News March 2, 2025

మహిళలకు గుడ్‌న్యూస్

image

AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టైలరింగ్‌లో 90 రోజులు శిక్షణ అందించి, ఉచితంగా కుట్టుమిషన్లు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో BC, EWS, కాపు సామాజికవర్గానికి చెందిన 1.02 లక్షల మంది మహిళలను ఇందు కోసం ఎంపిక చేయనున్నారు. BC వెల్ఫేర్ నుంచి 46,044, EWS నుంచి 45,772, కాపు కార్పొరేషన్ ద్వారా 11,016 మందిని ఎంపిక చేయనున్నారు.

Similar News

News December 8, 2025

39పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 39 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ, CA/ICWAI, డిప్లొమా, బీఎస్సీ(MPC), ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bvfcl.com/

News December 8, 2025

చిన్నవాడైన అల్లుడి కాలును మామ ఎందుకు కడుగుతారు?

image

పెళ్లి కొడుకును సాక్షాత్తూ నారాయణ స్వరూపంగా భావిస్తారు. పెళ్లి సమయంలో, అల్లుడి పాదాలను కడగడం అనేది తన కూతురిని తీసుకెళ్తున్న దేవుడికి ఇచ్చే గౌరవ మర్యాదగా, సేవగా పరిగణిస్తారు. ఈ ఆచారం ద్వారా, కూతురి తల్లిదండ్రులు తమ అల్లుడి పట్ల తమ భక్తిని, విధేయతను తెలియజేస్తారు. ఇది అల్లుడిని తమ ఇంటికి తీసుకువచ్చిన శుభ సంకేతంగా, దైవానుగ్రహంగా కూడా నమ్ముతారు.

News December 8, 2025

వెబ్‌సైట్లో కోటి ఎకరాల నిషేధిత భూముల జాబితా

image

TG: 22A జాబితాలోని నిషేధిత భూముల వివరాలు అందుబాటులోకి వచ్చాయి. స్టాంప్స్&రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్లో వీటిని అప్‌లోడ్ చేసింది. GOVT, ఎండోమెంటు, అటవీ, ఇరిగేషన్, పేదలకు కేటాయించిన 77 లక్షల ACERS ఈ జాబితాలో ఉన్నాయి. మరో 20L ఎకరాలకు పైగా పట్టాదారుల భూమి ఉంది. ముందుగా వీటిని పరిశీలించి భూములు కొనుగోలు చేయొచ్చు. కాగా RR, MDK, సంగారెడ్డి(D)లలో కొన్ని ఖరీదైన భూములను న్యాయ వివాదాలతో జాబితాలో చేర్చలేదు.