News August 3, 2024
మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే: మంత్రి రాంప్రసాద్

AP: మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అతిత్వరలోనే దీనిపై శుభవార్త చెప్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వీర్యమైందని అన్నారు. చిత్తూరు ఆర్టీసీ బస్ డిపోలో 17 నూతన బస్సులను ఆయన ఇవాళ ప్రారంభించారు.
Similar News
News April 14, 2026
META సీఈవో స్థానంలో ఏఐ.. ఎందుకంటే?

మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ పనిభారాన్ని తగ్గించేందుకు ఆ సంస్థ ఓ AI వెర్షన్‌ను రూపొందిస్తోంది. దీనివల్ల జుకర్‌బర్గ్ భౌతికంగా అందుబాటులో లేకున్నా ఈ ఏఐ ఏజెంట్ ఆయన తరఫున నిర్ణయాలు తీసుకోవడం, సమావేశాల్లో పాల్గొనడం వంటి పనులు చేస్తుంది. సంస్థ నిర్వహణను మరింత వేగవంతం చేయడం ఈ ‘మార్క్ జుకర్‌బర్గ్ 2.0’ ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో ఇతర కంపెనీల్లో కూడా ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది.
News April 14, 2026
యుద్ధంతో రూ.25 లక్షల కోట్ల నష్టం: ఇరాన్

అమెరికా-ఇజ్రాయెల్‌తో 40 రోజులపాటు సాగిన యుద్ధం వల్ల తమకు రూ.25 లక్షల కోట్ల నష్టం జరిగినట్లు ఇరాన్ వెల్లడించింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకా ఎక్కువే నష్టం ఉండొచ్చని తెలిపింది. దాడులకు బాధ్యులైన దేశాల నుంచి ఈ మొత్తాన్ని పరిహారం కోరతామని ప్రకటించింది.
News April 14, 2026
గాఢ సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభం

స్థూల సేంద్రియ ఎరువుల కంటే నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి నేలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఉదాహరణ: కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, పత్తి గింజల పిండి, చేపల పొట్టు, ఎముకల పొడి, కొమ్ముల పొడి, వర్మి కంపోస్టు మొదలైనవి. వీటి కొనుగోలు కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా నిపుణుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది.


