News March 3, 2025
GOOD NEWS: ప్రతి నెలా 24-28 వరకు ఉచిత ఆధార్ శిబిరాలు

AP: ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పథకాలకు ఇప్పుడు ఆధార్ తప్పనిసరి. అయితే రాష్ట్రంలో 11L మంది చిన్నారులకు ఆధార్ లేదు. అలాగే ఆధార్ నమోదు చేయించుకున్నప్పటికీ 42L మంది బయోమెట్రిక్ చేయించుకోలేదు. వారందరి కోసం ప్రభుత్వం ప్రతి నెలా 24-28 వరకు ఉచిత ఆధార్ శిబిరాలు నిర్వహించనుంది. స్కూళ్లు, అంగన్వాడీలు, సచివాలయాల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News February 4, 2026
మయన్మార్‌లో భూకంపం.. కోల్‌కతాలోనూ ప్రకంపనలు

మయన్మార్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 5.9గా నమోదైంది. భూకంప తీవ్రత వల్ల బంగ్లాదేశ్, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఇళ్లు, ఆఫీసులు స్వల్పంగా ఊగడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. 71 గంటల్లో మయన్మార్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి.
News February 4, 2026
WPL: ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్

WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో గుజరాత్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరింది. గుజరాత్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎల్లుండి జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, RCB జట్లు తలపడనున్నాయి.
News February 4, 2026
ఉదయాన్నే ఈ 6 పనులతో గుండె ఆరోగ్యం మీ చేతుల్లో!

గుండె దృఢంగా ఉండాలంటే ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగి శరీరాన్ని హైడ్రేట్ చేయాలని, చక్కెర తక్కువగా ఉన్న ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘కేవలం 5 నిమిషాల ధ్యానం, కొద్దిసేపు ఎండలో నడవడం, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తే BP కంట్రోల్‌లో ఉంటుంది. నిద్రలేవగానే కనీసం 30 నిమిషాల పాటు మొబైల్‌కు దూరంగా ఉంటే స్ట్రెస్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది’ అని చెబుతున్నారు.


