News November 12, 2024
GOOD NEWS: ఫ్రీ కోచింగ్, నెలకు రూ.2,500
AP: బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5,200 మందికి కోచింగ్ ఇస్తామని, BCలకు 66%, SCలకు 20%, STలకు 14% చొప్పున సీట్లు కేటాయించామన్నారు. వారితో పాటు EWS అభ్యర్థులకు 520 సీట్లు అదనంగా కేటాయించామని చెప్పారు. 2 నెలల పాటు ఇవ్వనున్న ఈ కోచింగ్ టైంలో నెలకు రూ.1500 స్టైఫండ్, మెటీరియల్ కోసం రూ.1000 ఇస్తామని తెలిపారు.
Similar News
News December 26, 2024
పెళ్లంటే భయం.. రొమాన్స్ అంటే ఇష్టం: శృతి హాసన్
తన వివాహం గురించి హీరోయిన్ శృతి హాసన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆమె తన ప్రియుడు శాంతనుతో వివాహం చేసుకుంటారని వార్తలు రాగా దీనిని ఆమె ఖండించారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అడగటం ఇక ఆపేయండంటూ సూచించారు. ‘నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ రిలేషన్లో ఉండేందుకు ఇష్టపడతా. నాకు రొమాన్స్ అంటే ఇష్టం. ఒకరితో నన్ను నేను ఎక్కువగా అటాచ్ చేసుకోవాలంటే కొంచెం భయంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.
News December 26, 2024
పిల్లలకు చదువుతోపాటు వీటిని నేర్పిస్తున్నారా?
పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలంటే ఐదు ఆధ్యాత్మిక అంశాలు నేర్పాలి. పిల్లలను కృతజ్ఞతాభావంతో పెంచాలి. ఎవరైనా సాయం చేసినప్పుడు వారికి కృతజ్ఞతలు చెప్పించాలి. చిన్నతనం నుంచే మనుషులు, మొక్కలు, జంతువులపై దయ ఉండేలా మలచాలి. చిన్నారుల్లో పరధ్యానం పోగొట్టడానికి ఏకాగ్రత అలవర్చాలి. క్షమాగుణం కూడా అలవాటు చేయాలి. ఎవరైనా తప్పు చేసినా పగ తీర్చుకోకుండా క్షమించడాన్ని నేర్పాలి. ఆధ్యాత్మికతపై వారిలో ఆసక్తిని పెంచాలి.
News December 26, 2024
మస్కట్ బాధితురాలిని రాష్ట్రానికి రప్పించిన మంత్రి లోకేశ్
AP: మస్కట్లో చిక్కుకుపోయిన ఓ మహిళను మంత్రి నారా లోకేశ్ క్షేమంగా రాష్ట్రానికి రప్పించారు. కోనసీమ జిల్లా పోలెకుర్రు పంచాయతీ తూర్పుపేటకు చెందిన వాసంశెట్టి పద్మ బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లారు. ఆమెకు అక్కడ యజమానుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఆమె తన బాధను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన లోకేశ్ వెంటనే స్పందించి ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారు.