News January 18, 2025
GOOD NEWS: ఉచితంగా ప్లాట్లు

AP: ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి <<15179066>>ఇళ్ల స్థలాలు<<>> ఇస్తామని నిన్న ప్రకటించింది. ఇవి ఉచితమా? డబ్బు చెల్లించాలా? అనే సందేహాలు ఉన్నాయి. అయితే ఈ ప్లాట్లు పూర్తి ఉచితంగా ఇస్తారు. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున కేటాయిస్తారు. కేంద్ర పథకాలతో ఈ కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపరచనున్నారు. గతంలో ప్లాట్లు పొంది ఇళ్లు నిర్మించుకోని వారికి వాటిని రద్దు చేసి కొత్త ప్లాట్లు ఇస్తారు.
Similar News
News January 27, 2026
ఆడ తోడు కోసం పెద్ద పులి సుదీర్ఘ ప్రయాణం!

TG: యాదాద్రి జిల్లాలో రెండు వారాలుగా పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. రాజాపేట, తుర్కపల్లి, యాదాద్రి మండలాల్లో సంచరిస్తూ లేగదూడలపై దాడులు చేస్తోంది. అటవీశాఖ అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా పులి జాడ కనుక్కోలేకపోతున్నారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి నదులు, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలు దాటుకుంటూ 400km ప్రయాణించి, ఆడ పులి తోడు కోసం వచ్చినట్లు భావిస్తున్నారు.
News January 27, 2026
173 పోస్టులు.. దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్

NCERTలో 173 నాన్ అకడమిక్ పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 30 ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in * మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 27, 2026
ఆటిజం పిల్లల్ని ఇలా పెంచాలి

ఆటిజం పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది వారికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు చిన్నారుల్లో సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి నైపుణ్యం ఉంటుంది. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే వీరిలో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.


