News October 28, 2025
రైతులకు కేంద్రం శుభవార్త

దేశంలోని రైతులను ఆదుకొనేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫెర్టిలైజర్ సబ్సిడీకి ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో రైతులకు ₹3వేల కోట్లమేర లబ్ధి చేకూరనుంది. PM అధ్యక్షతన జరుగుతున్న కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఫెర్టిలైజర్ సబ్సిడీ అంశంపై చర్చించి ఆమోదించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు ఇతర మరికొన్ని సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలపైనా మధ్యాహ్నం 3కి మీడియాకు వెల్లడిస్తారు.
Similar News
News October 28, 2025
శివుడి కోసం సతీదేవి ఏం చేసిందంటే..?

సతీదేవికి శివునిపై ఉన్న ప్రేమను, భర్త గౌరవం పట్ల ఆమెకున్న నిబద్ధతను దక్షయజ్ఞ ఘట్టం మనకు నిరూపిస్తుంది. శివుడిని దక్షుడు అవమానించడం ఆమె సహించలేకపోయింది. శివుని ఔదార్యాన్ని వివరించి, దక్షుడి అహంకారాన్ని ఖండించింది. శివునిపై ద్వేషం పెంచుకున్న తండ్రి నుంచి వచ్చిన ఈ శరీరం శివుని అవమానంతో కలుషితమైందని భావించింది. అందుకే, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి యోగాగ్ని ద్వారా దేహత్యాగం చేసింది. <<-se>>#Shakthipeetham<<>>
News October 28, 2025
మచిలీపట్నానికి 70kmల దూరంలో తుఫాన్

AP: బంగాళాఖాతంలో మొంథా తుఫాన్ గంటకు 15km వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 70 km, కాకినాడకు 150 km, విశాఖపట్నానికి 250 km దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో 90-110కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు.
News October 28, 2025
కుప్పకూలిన విమానం.. 12 మంది సజీవదహనం

కెన్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయి మంటలు వ్యాపించడంతో 12 మంది సజీవ దహనమయ్యారు. ఇవాళ ఉదయం టూరిస్టులతో డయాని నుంచి కిచ్వా టెంబోకు వెళ్తుండగా సింబా గోలిని ఏరియాలో కుప్పకూలినట్లు ఏవియేషన్ అధికారులు తెలిపారు. పోలీసు, ఎమర్జెన్సీ సర్వీసెస్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.


