News March 12, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్?

హోలీ పండగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎన్డీఏ సర్కార్ శుభవార్త చెప్పనుంది. ఇవాళ జరిగే క్యాబినెట్ సమావేశంలో DA(డియర్నెస్ అలవెన్స్), DR(డియర్నెస్ రిలీఫ్)పై ప్రకటన జారీ చేసే అవకాశముంది. ఇదే జరిగితే 1.2 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. కాగా గత ఏడాది జులైలో DAను 50% నుంచి 53శాతానికి కేంద్రం పెంచింది. ఈ సారి 2శాతం పెరుగుతుందని అంచనా.
Similar News
News November 13, 2025
NRPT: సమాచార కమిషనర్ల రాక

నారాయణపేటకు శుక్రవారం సమాచార కమిషనర్లు వస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు శ్రీనివాసరావు, మౌసిన పర్వీన్ కలిసి పౌర సమాచార అధికారులకు, అప్పీలేట్ అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. అనంతరం పెండింగ్ అప్పీళ్లు పరిశీలించి పరిష్కరిస్తారని అన్నారు.
News November 13, 2025
రోడ్లకు నేతల పేర్లకు బదులు కంపెనీల పేర్లు: సీఎం

TG: దేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉన్నాయని, హైదరాబాద్లో తాము ఆ ట్రెండ్ను మార్చాలనుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని అన్నారు. ఢిల్లీలో జరిగిన US-India సమ్మిట్లో సీఎం పాల్గొన్నారు. 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ’, మూసీ పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు చేపట్టామన్నారు.
News November 13, 2025
సింగరేణిలో 82 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సింగరేణిలో 82 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్నల్ అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 26లోగా పంపాలి. బేసిక్ శాలరీ నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వెబ్సైట్: scclmines.com


