News March 5, 2025
విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

AP: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దేందుకు ‘యాక్టివ్ ఆంధ్ర’ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిడమర్రు (మంగళగిరి) స్కూల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనుంది. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ వంటి ఆటలు ఆడిస్తారు. ఏ విద్యార్థికి ఏ క్రీడల్లో ఆసక్తి ఉందో అందులో శిక్షణ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారిని జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా మార్చడమే లక్ష్యమన్నాయి.
Similar News
News October 31, 2025
కొబ్బరి సాగు.. అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు (1/2)

ఆంధ్రప్రదేశ్లో బొండానికి, టెంకాయకు మేలైన కొబ్బరి రకాలు.
☛ ఈస్ట్కోస్ట్ టాల్: ఇది దేశవాళి పొడవు రకం. నాటిన 6 ఏళ్లలో కాపునకు వస్తుంది.  చెట్టుకు ఏడాదికి 80-100 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 64 శాతం.
☛ గౌతమి గంగ: ఇది పొట్టి రకం. నీటి బొండాలకు బాగా ఉపయోగపడుతుంది. నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. చెట్టుకు ఏడాదికి 85-90 కాయల దిగుబడి వస్తుంది. కాయలో నూనె దిగుబడి 69 శాతం. 
News October 31, 2025
కొబ్బరి సాగు.. అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు (2/2)

☛ డబుల్ సెంచరీ: ఇది పొడుగు కొబ్బరి రకం. నాటిన ఆరేళ్లకు కాపునకు వస్తుంది. ఏడాదికి చెట్టుకు 130 కాయల దిగుబడి వస్తుంది. ఈ రకం కొబ్బరిలో నూనె దిగుబడి 64 శాతం.
☛ గోదావరి గంగ: ఇది హైబ్రిడ్ కొబ్బరి రకం. నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. ఏడాదికి చెట్టుకు 140-150 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 68 శాతం. ఇవి కొబ్బరి బొండానికి, టెంకాయకు మేలైన రకాలు.  
News October 31, 2025
ప్రభుత్వ సలహాదారుగా పి.సుదర్శన్ రెడ్డి

TG: మంత్రి పదవి ఆశిస్తున్న బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ హోదా కల్పించారు. ఆయనను ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించారు. 6 గ్యారంటీల అమలు బాధ్యత ఆయనకు అప్పగించారు. మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్గా నియమించారు.


