News May 30, 2024

GOOD NEWS: పుస్తకాల రేట్లు తగ్గించిన ప్రభుత్వం

image

TG: జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో అన్ని మీడియంలకు చెందిన పాఠ్యపుస్తకాల ధరలు తగ్గనున్నాయి. ఒక్కో బుక్‌పై ₹10 నుంచి ₹74 వరకు తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. మార్కెట్‌లో పేపర్ రేటు తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కో క్లాస్ బుక్స్ రేట్స్‌పై పేరెంట్స్‌కు ₹200-300 ఆదా కానుంది. ఉదాహరణకు 2023-24లో టెన్త్ పుస్తకాల ధర ₹1,482 ఉండగా ఈసారి ₹1,126కి తగ్గింది.

Similar News

News October 15, 2024

‘ఆమడ దూరం’ వెళ్లొస్తా.. అంటే ఎంత దూరం?

image

పూర్వీకులు ఆమడ దూరం అనే పదాన్ని ఎక్కువగా వాడేవారు. ఏదైనా ప్రాంతం ఎంత దూరంలో ఉందో చెప్పేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. అయితే, ఇలా చెప్పేవారికీ అది ఎంతదూరమో తెలియదనేది వాస్తవం. ఆంగ్లేయులు రాకముందు భారతీయులు కొలతల్లో ‘ఆమడ’ను వినియోగించేవారు. దీన్నే యోజనం అని కూడా పిలుస్తారు. అతి చిన్న కొలత అంగుళమైతే.. అతిపెద్దది ‘ఆమడ’. 8 మైళ్ల దూరాన్ని ఆమడ అంటారు. అంటే దాదాపు 13 కిలోమీటర్లని పెద్దలు చెప్తుంటారు.

News October 15, 2024

84 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం

image

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవసీ పాలసీని ఉల్లంఘించిన 84.58 లక్షల ఖాతాలను వాట్సాప్ బ్యాన్ చేసింది. ఒక్క ఆగస్టులోనే ఈ సంఖ్యలో నిషేధం విధించినట్లు పేర్కొంది. వీటిలో అనుమానాస్పదంగా ఉన్న 16.61 లక్షల అకౌంట్లను ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ముందుగానే గుర్తించి జాగ్రత్త చర్యగా బ్యాన్ చేసినట్లు తెలిపింది. కాగా ఆగస్టులో వాట్సాప్ గ్రీవెన్స్‌కు 10,707 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది.

News October 15, 2024

‘దేవర’ విజయం: లేఖ రాసిన ఎన్టీఆర్

image

దేవర సినిమా విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ ఈరోజు ఓ లేఖ విడుదల చేశారు. ‘దేవర సినిమాకు నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మీరు అందిస్తున్న ఆదరణకు థాంక్స్. నా సహనటులు, టెక్నీషియన్స్, నిర్మాతలు అందరికీ ధన్యవాదాలు. నెల రోజులుగా దేవరను ఓ పండుగలా జరుపుకొంటున్న నా ఫ్యాన్స్‌కు శిరసు వంచి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎప్పటికీ మీరు గర్వపడే సినిమాలే చేయడానికి ప్రయత్నిస్తాను’ అని పేర్కొన్నారు.