News September 30, 2024
గుడ్న్యూస్ చెప్పిన TGSRTC

TG: దసరా, బతుకమ్మ పండుగల రద్దీ దృష్ట్యా 6వేల స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు TGSRTC ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి 15 వరకు తెలంగాణ నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు ఈ బస్సులు నడుపుతున్నామంది. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో MGBS, JBS, LB నగర్, ఉప్పల్, ఆరాంఘర్, KPHB నుంచి సర్వీసులు ఉంటాయంది. విజయవాడ, బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సమయాభావం తగ్గించేలా గచ్చిబౌలి ORR మీదుగా బస్సులు తిప్పుతామంది.
Similar News
News March 8, 2025
మహిళా దినోత్సవం ఎలా మొదలైందంటే?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. 1908లో న్యూయార్క్లో ఓటు హక్కు, మెరుగైన జీతాల కోసం 15 వేల మంది మహిళలు నిరసనకు దిగారు. ఆ రోజును దృష్టిలో పెట్టుకుని USలోని సోషలిస్టు పార్టీ 1909లో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఆ తర్వాత క్లారా జెట్కిన్ 1910లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని నిర్ణయించారు. ఐక్యరాజ్యసమితి 1975లో మార్చి 8ను మహిళా దినోత్సవంగా గుర్తించింది.
News March 8, 2025
విజయవాడకు పోసాని తరలింపు

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు కర్నూలు జైలు నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. పీటీ వారెంట్పై ఆయనను అక్కడికి తీసుకెళ్తున్నారు. కాగా విజయవాడలోని భవానీపురం పీఎస్లో పోసానిపై కేసు నమోదైంది. పీటీ వారెంట్పై ఆయనను అక్కడికి తీసుకువెళ్లేందుకు విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది. దీంతో పోలీసులు కర్నూలు నుంచి ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు.
News March 8, 2025
మహిళలకు SBI గుడ్ న్యూస్

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు మంజూరు చేస్తామని SBI ప్రకటించింది. ‘అస్మిత’ పేరుతో ప్రత్యేక లోన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. మహిళా వ్యాపార, పారిశ్రామికవేత్తలకు సులభంగా లోన్లు అందిస్తామని పేర్కొంది. మహిళల కోసం ‘నారీ శక్తి’ డెబిట్ కార్డును రూపొందించినట్లు తెలిపింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా చౌక వడ్డీకే మహిళలకు లోన్లు ఇస్తామని ప్రకటించింది.