News January 6, 2025
గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల మధ్య మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 8న చర్లపల్లి-శ్రీకాకుళం, 9న శ్రీకాకుళం-చర్లపల్లి మధ్య రైళ్లు నడవనున్నట్లు తెలిపింది. దీంతో పాటు ఈ నెల 11, 15 తేదీల్లో కాచిగూడ-శ్రీకాకుళం, 12, 16వ తేదీల్లో శ్రీకాకుళం-కాచిగూడ మధ్య ట్రైన్స్ నడపనున్నట్లు పేర్కొంది.
Similar News
News October 22, 2025
UPI ధమాకా.. రోజూ ₹94 వేల కోట్ల చెల్లింపులు

పండుగ సీజన్లో భారీ స్థాయిలో యూపీఐ పేమెంట్స్ జరిగాయి. ఈ నెలలో రోజూ సగటున రూ.94 వేల కోట్ల లావాదేవీలు నమోదైనట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) డేటా వెల్లడించింది. సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువని తెలిపింది. ఈ నెలలో ఇంకా వారం రోజులకు పైనే ఉండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో డిజిటల్ పేమెంట్స్‌లో 85 శాతం యూపీఐ ద్వారానే జరుగుతుండటం గమనార్హం.
News October 22, 2025
లిక్విడ్ లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉండాలంటే..

ముఖానికి మరింత సౌందర్యం అద్దడానికి చాలామంది మహిళలు లిప్‌స్టిక్ వేసుకుంటారు. అయితే ప్రస్తుతం లిక్విడ్ లిప్‌స్టిక్ ట్రెండ్ అవుతోంది. దీన్ని సరిగా వాడకపోతే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ముందు లిప్‌లైనర్‌తో పెదాల చుట్టూ లైనింగ్ చేయండి. తర్వాత లిక్విడ్ లిప్‌స్టిక్‌ను అప్లై చేసి ఆరనివ్వాలి. లిప్‌స్టిక్ మరీ ఎక్కువగా ఉందనిపిస్తే ఓ టిష్యూతో పెదాలను అద్దాలి. ఇలా చేస్తే లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది.
News October 22, 2025
ట్రాన్స్‌కో, జెన్కోలో మరో 6 నెలల పాటు సమ్మెలపై నిషేధం

AP: రాష్ట్ర పవర్ కార్పొరేషన్లలో మరో 6 నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ట్రాన్స్‌కో పరిధిలోని మూడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో, జెన్కోలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. నవంబర్ 10 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వివరించింది. కాగా ఇంతకు ముందు మే 10 నుంచి నవంబర్ 9 వరకు వర్తించేలా సమ్మె నిషేధ జీవో ఇచ్చింది. తాజాగా గడువు పొడిగించింది.


