News July 12, 2024

గుడ్ న్యూస్.. ఇక RTCలో డిజిటల్ చెల్లింపులు

image

TG: RTC బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ విధానం అందుబాటులోకి రానుంది. ఆగస్టుకల్లా సిటీ సర్వీసుల్లో, సెప్టెంబర్ నాటికి అన్ని జిల్లాల్లో ఇది అమలు కానుంది. ఇందుకోసం RTC 10వేల ఐ-టిమ్ మెషీన్లను తమ సిబ్బందికి అందించనుంది. దీని ద్వారా ప్రయాణికులు ఫోన్‌తో QR కోడ్ స్కాన్ చేసి డబ్బు చెల్లించి టికెట్ పొందవచ్చు. ఇప్పటికే కొన్ని రూట్లలో గరుడ, రాజధాని, సిటీ బస్సుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.

Similar News

News January 17, 2026

బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి: బండి సంజయ్

image

TG: త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘విజయ సంకల్ప సమావేశం’లో ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధికి నయాపైసా రాదని, బీఆర్ఎస్‌కు వేస్తే వృథాయేనని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటేస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.

News January 17, 2026

100 దేశాలకు కార్ల ఎగుమతి.. మారుతీ సుజుకీ ప్లాన్

image

తమ విక్టోరిస్ మోడల్ కారును 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. విక్టోరిస్‌ను అక్రాస్ పేరుతో గ్లోబల్ మార్కెట్‌లో విక్రయిస్తామని చెప్పింది. 450 కార్ల తొలి బ్యాచ్‌ను తరలించామని వెల్లడించింది. 2025లో 3.9 లక్షల కార్లను ఎగుమతి చేశామని సంస్థ సీఈవో హిసాషి టకేయుచి తెలిపారు. విక్టోరిస్ ధర రూ.10.50 లక్షలు-రూ.19.98 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.

News January 17, 2026

ఇరాన్ నుంచి వెెనుదిరుగుతున్న భారతీయులు

image

అంతర్గత నిరసనలు, మరోపక్క USతో యుద్ధవాతావరణం నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ పౌరులు వెనక్కి వస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందున ఇరాన్‌కు ప్రయాణాలు మానుకోవాలని అక్కడి ఇండియన్ ఎంబసీ ఇప్పటికే హెచ్చరించింది. ఆ దేశంలో 9000 మంది భారతీయులుండగా వీరిలో విద్యాభ్యాసం కోసం వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. కమర్షియల్ విమానాలు ప్రస్తుతం తిరుగుతున్నందున ఇరాన్ వీడి వెళ్లడం మంచిదని సూచించింది.