News March 28, 2025
డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై శుభవార్త

TG: గత ప్రభుత్వంలో మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. ఇంటి స్థలం లేని అర్హులకు వాటిని కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్ధిదారులే పూర్తిచేసుకునేలా ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో బేస్మెంట్ పూర్తిచేసిన వారికి తొలి విడత రూ.లక్ష చెల్లించాలని సూచించారు.
Similar News
News March 31, 2025
ORANGE ALERT: రేపటి నుంచి ఈ జిల్లాల్లో వర్షాలు

TGలో రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, MBNR, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడుతాయంది. ఏప్రిల్ 2, 3న ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తగ్గుతాయని తెలిపింది.
News March 31, 2025
10 నెలల్లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్

గత 10 నెలల్లో ఏపీకి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. విశాఖ బీచ్ రోడ్డులో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన హోటల్, ఆఫీస్ టవర్కు తల్లి భువనేశ్వరితో కలిసి భూమిపూజ చేశారు. గత పాలకులు విధ్వంసక విధానాలతో వ్యాపార వాతావరణానికి నష్టం కలిగించారని లోకేశ్ విమర్శించారు. తాము విశాఖను ఐటీ హబ్గా మార్చి రాబోయే ఐదేళ్లలో యువతకు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
News March 31, 2025
భూకంపం.. మసీదులు కూలి 700 మంది మృతి

గత శుక్రవారం మయన్మార్లో వచ్చిన భూకంపానికి మసీదులు కూలి ప్రార్థనలు చేస్తున్న 700 మందికి పైగా మరణించారని ఓ ముస్లిం సంఘ ప్రతినిధులు వెల్లడించారు. 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపానికి సుమారు 60 మసీదులు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పాత మసీదు భవనాలపై ఎక్కువ ప్రభావం పడిందని వివరించారు. కాగా, ఆ దేశంలో మొత్తం భూకంపం మృతుల సంఖ్య 1700 దాటింది.