News April 4, 2024
ఉద్యోగాల భర్తీపై గుడ్‌న్యూస్!

TG: జాబ్ నోటిఫికేషన్లలో ఇచ్చిన పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు TSPSC చర్యలు తీసుకుంటోంది. జిల్లా స్థాయి ఉద్యోగాలను 1:3 నిష్పత్తిలో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గ్రూప్-4 ఉద్యోగాలకూ ఇదే ఫార్ములాను అనుసరించనుందట. ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేస్తే అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చని భావిస్తోందట. జోనల్, మల్టీజోనల్ స్థాయి పోస్టులను మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేస్తారని సమాచారం.
Similar News
News December 6, 2025
దంపతులకు దత్తత ఫైనల్ ఆర్డర్ అందజేసిన కలెక్టర్

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఫ్రీ అడాప్షన్ పోర్టల్ ద్వారా 8నెలల చరణ్ బాబుకు తుది దత్తత ఆర్డర్‌ను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అందజేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన దంపతులకు ఈబిడ్డను దత్తత ఇచ్చారు. బాబును చూసుకునే విధానం, పోషణ, ఇమ్యునైజేషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, దత్తత తీసుకున్న వారిని సొంత తల్లిదండ్రులుగా గుర్తించి ఫైనల్ ఆర్డర్ ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
News December 6, 2025
భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచులో టీమ్ ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 270 రన్స్ చేయగా IND మరో 10.1 ఓవర్లు ఉండగానే టార్గెట్ ఛేదించింది. రోహిత్(75), జైస్వాల్(116*) తొలి వికెట్‌కు 155 పరుగులు జోడించారు. హిట్ మ్యాన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ(65*)తో కలిసి జైస్వాల్ INDకు విజయాన్ని అందించారు. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
News December 6, 2025
iBOMMA కేసు.. BIG TWIST

TG: iBOMMA రవి కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇవాళ అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకోలేదు. 3 కేసుల్లో 3 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు నిన్న అనుమతివ్వగా పోలీసులు అప్పీల్ పిటిషన్ వేశారు. 3 రోజుల కస్టడీ సరిపోదని, మరింత గడువు ఇవ్వాలని కోరారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. దీంతో అతను మరిన్ని రోజులు జైలులో గడపాల్సి ఉంటుంది. అలాగే రవి బెయిల్ పిటిషన్‌పైనా కోర్టు ఎల్లుండే వాదనలు విననుంది.


