News March 16, 2025

గుడ్ న్యూస్.. ఈ నెల 21 నుంచి వర్షాలు

image

TG: ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

Similar News

News November 26, 2025

కామారెడ్డి: కళా ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం

image

కామారెడ్డి జిల్లా పోలీసు కళా బృందం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కళా ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 200కు పైగా గ్రామాలు, విద్యాసంస్థల్లో కార్యక్రమాలు నిర్వహించిందని జిల్లా SP రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. స్థానిక భాష, యాసలో ఆటలు-పాటల ద్వారా ప్రజల్లో ఒకరిగా కలిసిపోయి అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈకార్యక్రమాల వల్ల ప్రజల ఆలోచనా విధానంలో మార్పు కనిపించడం ముఖ్య విజయమని ఎస్పీ పేర్కొన్నారు.

News November 26, 2025

సూర్యాపేట: సర్పంచ్ ఎన్నికలు.. మన గ్రామానికి ఎప్పుడంటే..

image

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు తుంగతుర్తి, నాగారం, నూతనకల్, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, మద్దిరాల, సూర్యాపేట, ఆత్మకూరు మండలాల్లో, రెండో విడత మోతె, చివ్వెంల, పెన్ పహాడ్. చిలుకూరు, కోదాడ, మునగాల, అనంతగిరి, నడిగూడెం మండలాల్లో జరగనున్నాయి. HNR నియోజకవర్గంలోని గ్రామాలకు మూడో విడతలో ఎన్నికలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు.

News November 26, 2025

భువనగిరి: సర్పంచ్ ఎన్నికలు.. కలెక్టర్ సూచనలు

image

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఉద్యోగి ఎన్నికల విధుల్లో బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. అలసత్వం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల శిక్షణ తరగతులకు ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల విధుల్లో ఎవరికీ మినహాయింపు ఉండవని స్పష్టం చేశారు.