News February 7, 2025

Good News: వడ్డీరేట్లు తగ్గించిన RBI

image

ఎట్టకేలకు RBI గుడ్‌న్యూస్ చెప్పింది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల మేర కత్తిరిస్తూ నిర్ణయం తీసుకుంది. 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గించింది. 2024, Feb 8 నుంచి వడ్డీరేట్లు 6.50% వద్దే గరిష్ఠంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం కుదుటపడుతోందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్ర తెలిపారు. వడ్డీరేట్ల తగ్గింపుతో ప్రజల చేతుల్లో డబ్బులు మిగులుతాయి. దీంతో వినియోగం పెరిగి ఎకానమీ పుంజుకోనుంది.

Similar News

News February 7, 2025

కుంభమేళాలో పాక్ హిందువుల స్నానాలు

image

మహా కుంభమేళాలో పాల్గొనేందుకు పాకిస్థాన్ నుంచి 68మంది హిందువులు ప్రయాగరాజ్‌కు చేరుకున్నారు. తమది సింధ్ ప్రావిన్స్ అని, 144 ఏళ్లకు ఓసారి వచ్చే ఈ మహత్తర సందర్భాన్ని మిస్ చేసుకోలేక భారత్‌కు వచ్చామని వివరించారు. ‘హరిద్వార్‌కు వెళ్లి మా అందరి పూర్వీకుల అస్థికల్ని గంగలో కలిపాం. మా మతం గొప్పదనాన్ని తొలిసారిగా మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నారు.

News February 7, 2025

ఢిల్లీ దంగల్: ఆప్‌పై ACBకి BJP ఫిర్యాదు?

image

ఫలితాలకు ముందే ఢిల్లీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఆప్‌పై ACBకి ఫిర్యాదు చేసేందుకు BJP సిద్ధమవుతున్నట్టు సమాచారం. 16 మంది MLAలకు ₹15CR చొప్పున ఇస్తామంటూ తమ నేతలకు BJP ఎరవేసిందని కేజ్రీవాల్ నిన్న ఆరోపించారు. దీనిపై మండిపడ్డ కమలం పార్టీ ఓటమికి కారణాలు చెప్పలేకే ఆప్ కొత్త నాటకం ఆడుతోందని విమర్శించింది. రిజల్టే రాలేదు, ఎవరు గెలుస్తారో తెలీదు, మరి MLAలకు ఎలా ఎరవేస్తారంటూ నెటిజన్లూ ట్రోల్ చేస్తున్నారు.

News February 7, 2025

సెలవు ఇవ్వలేదని…

image

ఆఫీస్‌లో సెలవు ఇవ్వలేదని నలుగురు సహోద్యోగులను పొడిచిన ఘటన బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగింది. అమిత్ కుమార్ సర్కార్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నిన్న అతడు లీవ్ కోసం అప్లై చేయగా రిజెక్ట్ అయింది. ఈ విషయంపైనే తోటి ఉద్యోగులతో వాగ్వాదానికి దిగిన అతడు కత్తితో నలుగురిపై దాడి చేశాడు. అనంతరం కత్తి, రక్తం మరకలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

error: Content is protected !!