News February 8, 2025

GOOD NEWS.. వారికి రూ.12,000

image

AP: వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల్లోని ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. అగ్రికల్చర్, పశువైద్య విద్యార్థుల స్కాలర్‌షిప్‌ను ₹7K నుంచి ₹10Kకు, PG స్టూడెంట్లకు ₹12Kకు పెంచింది. అలాగే సన్న రకం వరి సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యాదవ, కురబలకు BC కార్పొరేషన్ ద్వారా గొర్రెలు, మేకల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News February 8, 2025

ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం

image

ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కొద్దిసేపటి కిందటే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 20కి పైగా స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు ఆప్ 10 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అటు కాంగ్రెస్ 1 స్థానానికే పరిమితమైంది.

News February 8, 2025

CUET PG.. దరఖాస్తులకు నేడే లాస్ట్

image

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(CUET) PG ప్రవేశాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. <>https://exams.nta.ac.in/<<>> వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో సవరణకు ఈనెల 10-12 వరకు అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ప్రముఖ సెంట్రల్, ప్రైవేట్ వర్సిటీల్లో PG కోర్సుల్లో ప్రవేశాల కోసం CUET నిర్వహిస్తారు. 157 సబ్జెక్టుల్లో మార్చి 13 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయి.

News February 8, 2025

ఆధిక్యంలో ఖాతా తెరిచిన కాంగ్రెస్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరువు కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. ఆ పార్టీ ఓ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు బీజేపీ, ఆప్ మధ్య థగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. బీజేపీ 15, ఆప్ 13 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నాయి.

error: Content is protected !!