News March 23, 2025

గుడ్‌న్యూస్: 100శాతం రాయితీతో రూ.50,000

image

TG: రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా చిరువ్యాపారాలు చేసే ఈబీసీలకు ప్రభుత్వం 100% రాయితీతో రూ.50వేల రుణం అందిస్తోంది. రూ.లక్షలోపు రుణాలకు 90% రాయితీ ఇవ్వనుంది. ఓ లబ్ధిదారుడు రూ.లక్ష తీసుకుంటే కేవలం రూ.10వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఇక రూ.లక్ష నుంచి రూ.2లక్షల్లోపు రుణాలకు 80శాతం, రూ.2-4లక్షల్లోపు రుణాలకు 70శాతం రాయితీ ఇవ్వనుంది. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
వెబ్‌సైట్:<> tgobmmsnew.cgg.gov.in<<>>

Similar News

News November 11, 2025

INDvsSA: టాస్‌కు గాంధీ-మండేలా కాయిన్

image

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈనెల 14 నుంచి IND-SA తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ టాస్ కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ స్పెషల్ గోల్డ్ కాయిన్‌ను సిద్ధం చేసింది. ఇది గాంధీ-మండేలా ట్రోఫీ కావడంతో నాణేనికి చెరోవైపు వారి చిత్రాలను రూపొందించింది. భారత్, దక్షిణాఫ్రికా స్వాతంత్య్రం కోసం వారు చేసిన కృషికి నివాళిగా ఈ కాయిన్‌ను వాడనుంది. కాగా గువాహటి వేదికగా NOV 22-26 మధ్య రెండో టెస్టు జరగనుంది.

News November 11, 2025

కేంద్ర వైఫల్యం వల్లనే ఢిల్లీలో పేలుడు: కాంగ్రెస్ నేత

image

ఢిల్లీలో పేలుడు ఘటన పూర్తిగా కేంద్రం వైఫల్యమేనని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. ఫరీదాబాద్‌లో 360 KGల పేలుడు పదార్థాలు దొరికినా ప్రభుత్వం నిరోధించలేకపోయిందన్నారు. ‘ఆరేళ్ల క్రితం పుల్వామాలో 350 KGల RDX దొరికింది. ఇటీవల ఢిల్లీ ATCపై సైబర్ ఎటాక్‌తో 800 ఫ్లైట్స్‌కు ఆటంకం కలిగింది. ఇలాంటివి జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన ఉండడం లేదు’ అని విమర్శించారు. దేశంలో భయంకర పరిస్థితులున్నాయన్నారు.

News November 11, 2025

హార్ట్ బ్రేకింగ్.. బాంబ్ బ్లాస్ట్‌తో కుటుంబం రోడ్డుపైకి!

image

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్‌లో మరణించినవారిలో కుటుంబానికి ఏకైక ఆధారమైన అశోక్ కూడా ఉన్నారు. మొత్తం కుటుంబంలో 8 మంది ఆయన సంపాదన మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు కాగా.. అందులో ముగ్గురు ఆడపిల్లలు, ఓ అబ్బాయి. తల్లితో పాటు అనారోగ్యంతో ఉన్న అన్నయ్య పోషణను కూడా అశోక్‌ చూసుకుంటున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది రావొద్దని ఆయన పగటిపూట కండక్టర్‌గా, రాత్రిపూట సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు.