News July 2, 2024
గుడ్ న్యూస్.. రేపు స్వదేశానికి భారత జట్టు!

బెరిల్ హరికేన్ కారణంగా వెస్టిండీస్‌లోని బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన భారత జట్టు రేపు స్వదేశానికి రానున్నట్లు తెలుస్తోంది. జట్టు ఆటగాళ్ల కోసం BCCI ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియా ప్రతినిధులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రేపు ఉదయం 7.45 గంటలకు ఢిల్లీ చేరుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం హరికేన్ ప్రభావంతో అక్కడ కర్ఫ్యూ విధించగా ఎయిర్ పోర్టును మూసివేశారు.
Similar News
News April 7, 2026
వర్షం.. KKRvsPBKS మ్యాచ్ రద్దు

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన KKRvsPBKS మ్యాచ్ రద్దయ్యింది. వర్షం ఎంత సేపటికీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఇవాళ KKR టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. మ్యాచ్ ఆగే సమయానికి 3.4 ఓవర్లలో 25/2 స్కోర్ చేసింది. ఇక 2025 ఏప్రిల్ 26న కూడా ఇదే వేదికలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగానే రద్దయ్యింది.
News April 7, 2026
రేపు ఇరాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చు: ట్రంప్

పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందని ఆశించే లోపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ తెరవడంతో పాటు ఇరాన్ తమ దారిలోకి రాకపోతే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ విజయవంతంగా నడుస్తోందన్నారు. ఒక్క రాత్రిలో ఇరాన్‌ను ధ్వంసం చేయగలమని, రేపే ఆ దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చని తెలిపారు. ఏ దేశానికీ లేని విధంగా అమెరికా వద్ద ఆయుధాలు ఉన్నాయని చెప్పారు.
News April 7, 2026
రాజధానిగా అమరావతి.. ముఖ్యమైన తేదీలివే!

➤ మార్చి 28, 2026: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని ఆమోదిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం.
➤ ఏప్రిల్ 1: లోక్‌సభలో అమరావతి బిల్లుపై 2గంటలకు పైగా చర్చ.. ఆపై ఆమోదం
➤ ఏప్రిల్ 2: రాజ్యసభలో గంటకు పైగా చర్చ.. అనంతరం బిల్లుకు ఆమోదం
➤ ఏప్రిల్ 6: రాజ్యసభ నుంచి రాష్ట్రపతి భవన్‌కు బిల్లు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేయడంతో అమరావతికి చట్టబద్ధత. గెజిట్ నోటిఫికేషన్ విడుదల


