News July 5, 2025
గుడ్‌న్యూస్.. సగానికి తగ్గనున్న టోల్ ఫీజ్!

కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ఫీజు నిబంధనల్లో చేసిన మార్పుల కారణంగా త్వరలో టోల్ ఛార్జీలు తగ్గే అవకాశముంది. 2008లో టోల్ ప్లాజాలకు సంబంధించి నిర్ణయించిన యూజర్ ఛార్జీలను తాజాగా సవరించింది. కొత్త రూల్స్ ప్రకారం సొరంగాలు, బ్రిడ్జిలు ఉన్న జాతీయ మార్గాల్లో టోల్ ఫీజ్ లెక్కింపు పద్ధతి మారనుంది. ఈ క్రమంలో దాదాపు సగం వరకు ఛార్జీ తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో వాహనదారులకు మేలు జరగనుంది.
Similar News
News July 5, 2025
వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు

APలో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. QR కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్తవి ఆగస్టులో పంపిణీ చేయనుంది. నేతల ఫొటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫొటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల కొత్త రేషన్‌కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది.
News July 5, 2025
ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన HYDలోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
News July 5, 2025
ఎల్లుండి ఫలితాలు విడుదల

తెలంగాణ ఐసెట్ ఫలితాలు జులై 7న విడుదల కానున్నాయి. HYD ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం మ.3.30 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 8,9 తేదీల్లో రోజుకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. జూన్ 21న రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. 71,757 మంది పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.