News August 1, 2024
GOOD NEWS: రేపే జాబ్ క్యాలెండర్

TG: జాబ్ క్యాలెండర్‌ను రేపు అసెంబ్లీలో ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు రూ.437 కోట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. GHMCలో ఔటర్ గ్రామాల విలీనానికి శ్రీధర్‌బాబు అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Similar News
News April 8, 2026
మోదీజీ ఎవరిని ఫూల్ చేస్తున్నారు: ప్రకాశ్ రాజ్

ముద్రా యోజన పథకం ద్వారా 52 కోట్ల మందిని వ్యాపారులుగా మార్చామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. 150 కోట్ల జనాభాలో 52 కోట్ల మంది వ్యాపారులుగా మారారా? అని ప్రశ్నించారు. ఎవరిని ఫూల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతకుముందు ఈ పథకం ద్వారా అనేక మంది వ్యాపార కలలను సాకారం చేశామని ప్రధాని Xలో పోస్ట్ చేశారు. దాదాపు 52 కోట్ల మందిని వ్యాపారులుగా మార్చామన్న ‘MyGovIndia’ పోస్ట్‌ను షేర్ చేశారు.
News April 8, 2026
సమ్మర్లో ఇది నానబెట్టుకుని తింటే..

సమ్మర్లో గోండ్ కటీరా బాడీని కూల్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒక నేచురల్ గమ్. Astragalus species అనే మొక్కల వేర్ల నుంచి సేకరిస్తారు. రాత్రి ఒక స్పూన్ కటీరాను గ్లాసు నీటిలో నానబెడితే జెల్లీలా తయారవుతుంది. దీన్ని షర్బత్, పాలు, నిమ్మరసంలో కలుపుకొని తాగాలి. డీహైడ్రేషన్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గేందుకు సాయపడుతుంది. వెంట్రుకలు, చర్మ ఆరోగ్యానికీ మంచిది.
News April 8, 2026
BSNL ఫైబర్.. రూ.399తో 50Mbps వేగంతో హైస్పీడ్ డేటా

BSNL ఫైబర్ యూజర్లకు అదిరిపోయే న్యూస్. తక్కువ ధరలో ఎక్కువ డేటా కావాలనుకునే వారికోసం BSNL సరికొత్త ‘స్పార్క్’ ఫైబర్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం నెలకు రూ.399 చెల్లిస్తే 50 Mbps వేగంతో 3300GB హై-స్పీడ్ డేటాను పొందొచ్చు. అలాగే ఉచిత అన్లిమిటెడ్ కాల్స్ కూడా లభిస్తాయి. అయితే ఈ రూ.399 ధర మొదటి 12 నెలలు మాత్రమే వర్తిస్తుందని, 13వ నెల నుంచి రూ.449కి మారుతుందని సంస్థ స్పష్టం చేసింది.


