News April 7, 2025
GOOD NEWS: రెండున్నరవేల ఖాళీలు భర్తీ

TG: వర్సిటీల్లో ఉద్యోగాల కోసం 15ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 12 వర్సిటీల్లో ఖాళీగా ఉన్న రెండున్నరవేలకుపైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్‌ను భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News April 9, 2025
ALERT: రేపే లాస్ట్ డేట్

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తులకు రేపే తుది గడువు. ‘అగ్నివీర్‌గా ఆర్మీలో చేరండి. గౌరవం, క్రమశిక్షణతో కూడిన ప్రయాణానికి సిద్ధంకండి’ అంటూ Xలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ డైరెక్టరేట్ జనరల్ ట్వీట్ చేశారు. ఆన్‌లైన్ ఎంట్రన్స్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ పరీక్షల ద్వారా నియామకాలు జరుగుతాయి. Age లిమిట్ 17.5-21yrs. www.joinindianarmy.nic.in సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
News April 9, 2025
ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది మృతి

చైనా హెబీ ప్రావిన్స్‌లోని ఓ నర్సింగ్ హోమ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది చనిపోగా పలువురు గాయపడినట్లు అక్కడి మీడియా తెలిపింది. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఫైర్ యాక్సిడెంట్‌కు గల కారణాలను వెల్లడించలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించింది.
News April 9, 2025
3 రోజులపాటు ఆస్పత్రిలోనే మార్క్ శంకర్

సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన Dy.CM పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. రాత్రి ఆస్పత్రికి చేరుకున్న పవన్ పిల్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడం వల్ల తలెత్తే సమస్యలపై పరీక్షలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడిని ఎమర్జెన్సీ వార్డు నుంచి సాధారణ గదికి తీసుకొచ్చామన్నారు. మరో 3 రోజులపాటు టెస్టులు చేయాల్సి ఉందని వెల్లడించారు.