News February 14, 2025

Good News: హోల్‌సేల్ రేట్లు తగ్గాయ్..

image

భారత టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) జనవరిలో 2.31 శాతానికి తగ్గింది. 2024 డిసెంబర్లో ఇది 2.37%. గత ఏడాది జనవరిలో ఇది 0.27 శాతమే కావడం గమనార్హం. ఆహార వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. ఫుడ్ ప్రొడక్ట్స్, టెక్స్‌టైల్స్ తయారీ, క్రూడ్ పెట్రోల్, గ్యాస్ ధరలు మాత్రం పెరుగుతున్నట్టు పేర్కొంది. డిసెంబర్లో 8.89గా ఉన్న WPI ఫుడ్ ఇండెక్స్ విలువ జనవరిలో 7.47కు దిగొచ్చిందని తెలిపింది.

Similar News

News January 17, 2026

ముంబై తీర్పుపై మోదీ ట్వీట్

image

ముంబై BMC ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారు కావడంతో PM మోదీ సంతోషం వ్యక్తం చేశారు. NDAపై విశ్వాసం ఉంచిన ముంబై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే ముంబై నగరంలో మరింత మెరుగైన పాలన అందిస్తామని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని MH సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.

News January 17, 2026

నేటి ముఖ్యాంశాలు

image

✴ 70వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: సీఎం రేవంత్
✴ ఉమ్మడి ఆదిలాబాద్‌లో సదర్మట్, చనాక-కొరాటా బ్యారేజీలను ప్రారంభించిన సీఎం
✴ మేడారంలో ఒక్కరోజే 6 లక్షల మంది భక్తుల దర్శనం
✴ మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
✴ ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్
✴ రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు?: జగన్
✴ ‘సంక్రాంతి’ తిరుగు ప్రయాణాలు.. బస్సులు, రైళ్లలో రద్దీ

News January 17, 2026

WPL: RCB హ్యాట్రిక్ విజయం

image

WPLలో ఆర్సీబీ వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసింది. టాప్‌ ఆర్డర్‌ తడబడినా రాధా యాదవ్‌ 66 పరుగులతో జట్టును నిలబెట్టారు. రిచా ఘోష్‌ 44 పరుగులతో మద్దతు ఇవ్వగా, చివర్లో క్లర్క్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఛేజింగ్‌లో గుజరాత్‌ 150 పరుగులకు పరిమితమైంది. శ్రేయాంక పాటిల్ 5 వికెట్లు తీశారు.