News April 10, 2024
భారత్-చైనా మధ్య సత్సంబంధాలు అవసరం: ప్రధాని మోదీ

భారత్-చైనా మధ్య సత్సంబంధాలు ఉండటం ఇరు దేశాలకే కాక ప్రపంచానికీ అవసరమన్నారు ప్రధాని మోదీ. ద్వైపాక్షిక చర్చలతో ఇరు దేశాల మధ్య తిరిగి శాంతిని నెలకొల్పవచ్చని ఆకాంక్షించారు. క్వాడ్ కూటమి ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసినది కాదన్నారు. ఆర్టికల్ 370 రద్దును సమర్థించుకున్న మోదీ.. అక్కడి ప్రజలకు జీవితాలపై సరికొత్త ఆశలు చిగురించాయన్నారు. న్యూస్‌వీక్ మ్యాగజైన్ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
Similar News
News March 31, 2026
‘3-2-1’ బ్యాకప్ రూల్‌తో మీ డేటా సేఫ్!

ఈ డిజిటల్ యుగంలో ముఖ్యమైన సమాచారం సేఫ్‌గా ఉండాలంటే బ్యాకప్ తప్పనిసరి. ఇందుకు 3-2-1 రూల్ ఫాలో అయితే మంచిదంటున్నారు నిపుణులు. ఓరిజినల్ డేటా కాక మరో రెండు అంటే మొత్తం 3 కాపీలు ఉండాలి. రెండు వేర్వేరు స్టోరేజీల్లో ఈ డేటా సేవ్ చేయాలి. మీ సిస్టమ్‌లో ఒకటి ఉంటే మరోటి హార్డ్‌డ్రైవ్‌లో పెట్టుకోవాలి. ఇక మరో కాపీ క్లౌడ్ సర్వర్‌లో స్టోర్ చేసుకోవాలి. దీంతో డేటా నష్టాన్ని నివారించొచ్చు. ఈరోజు వరల్డ్ బ్యాకప్ డే.
News March 31, 2026
జనగణన: మే1 నుంచి ఏపీలో, 16 నుంచి TGలో

జనగణన ప్రక్రియ AP, TGలో మే నుంచి ఆరంభం కానుంది. ముందుగా ఇళ్ల సర్వే ఏపీలో మే 1-30 వరకు, TGలో మే11-JUN9 వరకు ఉంటుంది. ఇక సెల్ఫ్ ఎన్యూమరేషన్ APలో మే16-30 తేదీల్లో, TGలో APR 26-మే10 తేదీ మధ్య జరుగుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ప్రజలు ఇళ్ల సమాచారాన్ని సెన్సస్ వెబ్‌సైట్లో నమోదు చేయొచ్చు. ఇళ్ల సర్వేలో 34 ప్రశ్నలు అడుగుతారు. సెన్సెస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ ఇవాళ మీడియా భేటీలో వీటిని వెల్లడించారు.
News March 31, 2026
రేపటి నుంచి ఇంటర్ క్లాసులు

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఉ.8 నుంచి మ.12:30 వరకు బోధన ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇంటికి పంపుతారు. ఏప్రిల్ 23 వరకు తరగతులు కొనసాగుతాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభమవుతాయి. కాగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్, ఎగ్జామ్స్ జరిగిన విషయం తెలిసిందే.


