News May 21, 2024
‘కన్నప్ప’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ : మంచు విష్ణు

‘కన్నప్ప’ మూవీ టీజర్‌ను ప్రతిష్ఠాత్మక కేన్స్‌లో ప్రదర్శించినట్లు హీరో మంచు విష్ణు ట్వీట్ చేశారు. ‘టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్లు, స్థానిక భారతీయులు, ప్రతి ఒక్కరూ ఇష్టపడ్డారు. దీనిని చూసి నేను ఎంతో సంతోషించా. టీజర్ జూన్ 13న రిలీజ్ కానుంది. మే 30న HYDలోని ప్రముఖ థియేటర్లో తెలుగు వెర్షన్ టీజర్ ప్రదర్శిస్తాం. ఎంపిక చేసిన వారికే ఈ అవకాశం’ అని తెలిపారు.
Similar News
News January 7, 2026
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

AP: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణశాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుందని చెప్పింది. అయితే తుఫానుగా మారుతుందా? లేదా? అనేది ప్రకటించలేదు. వాయుగుండంగా మారిన తర్వాత తమిళనాడుతో పాటు ఈ నెల 10, 11 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
News January 7, 2026
త్వరగా పెళ్లి కావాలంటే.. పఠించాల్సిన మంత్రాలు

*కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్ యతీశ్వరీ|
నందగోప సుతం దేవీ పతిమే కురుతే నమః||
*అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః|
కామేశ బద్ద మాంగల్య సూత్ర శోభిత కందర||
*విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే||
*సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే|
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే||
News January 7, 2026
గ్రీన్లాండ్ కావాల్సిందే.. అవసరమైతే సైన్యాన్ని వాడతామన్న US

గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడం తమకు చాలా ముఖ్యమని అమెరికా తేల్చి చెప్పింది. అవసరమైతే సైన్యాన్ని వాడతామని వైట్ హౌస్ హెచ్చరించడం సంచలనం రేపుతోంది. రష్యా, చైనాలను అడ్డుకోవడానికి ఈ ద్వీపం తమకు అవసరమని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని డెన్మార్క్, ఐరోపా దేశాలు స్పష్టం చేస్తున్నాయి. సరిహద్దుల విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని యూరప్ నేతలు అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.


