News March 26, 2024

శుభ ముహూర్తం

image

తేదీ: మార్చి 26, మంగళవారం
బహుళ పాడ్యమి: మధ్యాహ్నం 02:55 గంటలకు
హస్త: మధ్యాహ్నం 01:33 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 08:35-09:23 గంటల వరకు
రాత్రి 11:01-11:48 గంటల వరకు
వర్జ్యం: రాత్రి 10:27

Similar News

News March 19, 2026

కొత్తగా మరో 5 రకాల వైకల్యాలకు ‘సదరం’

image

AP: కొత్తగా 5 రకాల వైకల్యాలకు సదరం సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. యాసిడ్ దాడి బాధితులు, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజార్డర్, అభ్యాస వైకల్యం, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్(ASD), బహుళ వైకల్యంను జాబితాలో చేర్చినట్లు చెప్పారు. ఇక సదరం సర్టిఫికెట్లు డిజిటల్ విధానంలోనే ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 25వ తేదీ స్లాట్ బుకింగ్, 30వ తేదీ నుంచి వైద్యపరీక్షలు ప్రారంభమవుతాయని వివరించారు.

News March 19, 2026

ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

image

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్‌లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.

News March 19, 2026

రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. మే 15 నుంచి జూన్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, సంబంధిత విభాగంలో ITI/డిప్లొమా ఉత్తీర్ణత, 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. CBT 1, CBT 2, CBAT, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/