News July 17, 2024
శుభ ముహూర్తం

తేది: జులై 17, బుధవారం
ఏకాదశి: రాత్రి 9.02 గంటలకు
అనూరాధ: తెల్లవారుజామున 3.12 గంటలకు
వర్జ్యం: ఉదయం 6.23 నుంచి ఉదయం 8.03 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 11.47 నుంచి మధ్యాహ్నం 12.39 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12.00 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు
Similar News
News November 16, 2025
కామారెడ్డి: కన్న ఊరును వీడిన ‘బతుకు బండి’

చెరుకు సీజన్ షురూ కావడంతో గిరిజన ప్రాంతాల నుంచి వలసలు మొదలయ్యాయి. ప్రతి ఏటా మాదిరిగానే, ఈ ఏడాది కూడా సంగారెడ్డి జిల్లాకు చెందిన గిరిజనులు ఉపాధి నిమిత్తం కామారెడ్డి షుగర్ ఫ్యాక్టరీకి పయనమయ్యారు. ఉగాది పండుగ సమయానికి తిరిగి తమ సొంతూళ్లకు చేరుకుంటారు. సంగారెడ్డి జిల్లా వాసులు ఎడ్ల బండ్లు కట్టుకుని, తమ సామగ్రిని తీసుకుని పిట్లం మీదుగా శనివారం వెళ్తుండగా.. ‘Way2News’ క్లిక్ మనిపించిన దృశ్యమిది.
News November 16, 2025
రేపే కార్తీక మాస చివరి సోమవారం.. ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం

రేపు కార్తీక మాసంలో చివరి సోమవారం. గత సోమవారాలు, పౌర్ణమి వేళ 365 వత్తుల దీపం వెలిగించని, దీపదానం చేయని వారు రేపు ఆ లోపాన్ని సరిదిద్దుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ ఒక్క రోజు శివారాధన కోటి సోమవారాల ఫలితాన్ని, కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. రేపు ప్రదోష కాలంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి, శివుడి గుడిలో దీపదానం చేస్తే శుభకరమని సూచిస్తున్నారు. మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి<<>>.
News November 16, 2025
నేడు నాన్ వెజ్ తినవచ్చా?

కార్తీక మాసంలో రేపు(చివరి సోమవారం) శివాలయాలకు వెళ్లేవారు, దీపారాధన, దీపదానం చేయువారు నేడు నాన్ వెజ్ తినకూడదని పండితులు సూచిస్తున్నారు. అది కడుపులోనే ఉండి రేపటి పూజకు అవసరమైన శరీర పవిత్రతను దెబ్బ తీస్తుందని అంటున్నారు. ‘మాంసాహారం రజోతమో గుణాలను ప్రేరేపించి, దైవారాధనలో ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి శివానుగ్రహాన్ని పొందడానికి, పూజ ఫలం కలగడానికి నేడు సాత్విక ఆహారం స్వీకరించడం ఉత్తమం’ అంటున్నారు.


