News July 23, 2024

శుభ ముహూర్తం

image

తేది: జులై 23, మంగళవారం బ.విదియ: ఉదయం 10.23 గంటలకు ధనిష్ఠ: రాత్రి 08.18 గంటలకు వర్జ్యం: అర్ధరాత్రి గం.2.53 నుంచి తెల్లవారుజామున గం.4.20 వరకు దుర్ముహూర్తం: ఉదయం గం.8.21 నుంచి గం.9.13 వరకు తిరిగి రాత్రి గం.11.07 నుంచి 11.51 వరకు రాహుకాలం: మధ్యాహ్నం గం.3.00 నుంచి గం.4.30 వరకు

Similar News

News October 15, 2025

హిందీ మూవీస్‌ బ్యాన్‌కు TN ప్రభుత్వం బిల్లు!

image

తమిళనాడులో హిందీ ఇంపోజిషన్‌ను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా హిందీ మూవీస్, సాంగ్స్, హోర్డింగ్స్‌ను బ్యాన్ చేసేందుకు ఇవాళ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ విషయంలో చట్టపరమైన సవాళ్లపై నిన్న రాత్రి సీఎం స్టాలిన్ అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా ఇది మూర్ఖత్వమని బీజేపీ నేత వినోజ్ సెల్వమ్ మండిపడ్డారు.

News October 15, 2025

ప్రముఖ సింగర్ బాలసరస్వతి కన్నుమూత

image

తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన రావు బాలసరస్వతి(97) తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1928లో జన్మించిన ఆమె ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు. ‘సతీ అనసూయ’ చిత్రంలో తొలి పాట పాడారు. ఆరేళ్ల వయసు నుంచే పాడటం మొదలెట్టిన బాలసరస్వతి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో 2 వేలకు పైగా పాటలు ఆలపించారు. పలు సినిమాల్లో నటించారు.

News October 15, 2025

పాదాలు తెల్లగా అవ్వాలంటే..

image

చాలామంది ఇతర శరీర భాగాలపై పెట్టిన శ్రద్ధ పాదాలపై పెట్టరు. దీంతో ఇవి దీర్ఘకాలంలో నల్లగా మారిపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు చర్మ నిపుణులు. కాళ్లను క్లీన్ చేశాక తడిలేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్‌ రాయాలి. బయటకు వెళ్లేటపుడు సన్‌స్క్రీన్‌ రాసుకోవాలి. లాక్టిక్‌ యాసిడ్‌, గ్లైకాలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ C, హైడ్రోక్వినోన్‌లున్న లైటెనింగ్‌ క్రీములు వాడాలని సూచిస్తున్నారు.