News March 29, 2024
శుభ ముహూర్తం

తేది: మార్చి 29, శుక్రవారం
బహుళ చవితి: సాయంత్రం 08:21 గంటలకు
విశాఖ: సాయంత్రం 08:36 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 08:33-09:22 గంటల వరకు
మధ్యాహ్నం 12:36-01:24 గంటల వరకు
వర్జ్యం: తెల్లవారుజాము 00:41-02:25 గంటల వరకు
Similar News
News April 2, 2026
ఇలాంటి కొడుకు బతికున్నా ప్రయోజనం లేదు!

తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తల్లిదండ్రుల మీద దయ, ప్రేమలేని కుమారుడు పుట్టినా, చచ్చినా ఒక్కటే. ఎవరికీ ఉపయోగం ఉండదు. పుట్టలో చెదలు నిరంతరం పుడుతూ, చస్తూ ఉంటాయి. వాటిని ఎవరూ పట్టించుకోరు. తల్లిదండ్రులకు సేవ చేయని కొడుకు కూడా ఆ చెదలతో సమానమే. <<-se>>#PADHYAM<<>>
News April 2, 2026
సల్మాన్ – వంశీ పైడిపల్లి సినిమాలో అరవింద్ స్వామి?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లోని మూవీపై ఆసక్తికర అప్డేట్స్ వచ్చాయి. ఇందులో సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఓ పాజిటివ్ రోల్లో కనిపిస్తారని సమాచారం. ఓ పవర్ఫుల్ యాక్షన్ క్యామియోకు బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్‌ను సంప్రదించినట్లు టాక్. ఇక విలన్ పాత్రకు ఓ టాప్ బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని మూవీ టీమ్ భావిస్తోందట. ఇదే జరిగితే సినిమాపై అంచనాలు భారీగా పెరగనున్నాయి.
News April 2, 2026
రూపీ సూపర్ రికవరీ

ఇటీవల ఒక డాలరుకు ₹95.12కు చేరి ఆల్ టైమ్ <<19515449>>కనిష్ఠాన్ని<<>> నమోదు చేసిన రూపాయి విలువ క్రమంగా కోలుకుంటోంది. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలో భారీ రికవరీ నమోదు చేసింది. ఒక డాలరుకు 93.48గా ఉన్న రూపాయి విలువ ఏకంగా 88 పైసలు పెరిగి 92.60కు చేరింది. యుద్ధం ఆగే సూచనలు, మార్కెట్లు నిన్న సానుకూలంగా ఉండటం రూపాయి రికవరీకి కలిసొచ్చింది.


