News August 28, 2024
శుభ ముహూర్తం

తేది: ఆగస్టు 28, బుధవారం
దశమి: రాత్రి 1.19 గంటలకు
మృగశిర: మధ్యాహ్నం 3.52 గంటలకు
వర్జ్యం: రాత్రి 12.33-2.12 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 11.43-12.33 గంటల వరకు
Similar News
News March 19, 2026
రిటైర్మెంట్ ఆలోచన లేదు: బట్లర్

T20WCలో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దీంతో క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారనే వార్తలను ఆయన ఖండించారు. ‘కచ్చితంగా WCలో నిరాశపరిచాను. అయితే నేను ఇంకా వైట్ బాల్ క్రికెట్ ఆడాలనుకుంటున్నా. తిరిగి ఫామ్‌లోకి వస్తాననే నమ్మకం ఉంది. అయితే నేను కెప్టెన్/సెలక్టర్ కాదు. ఏం జరుగుతుందో చూద్దాం’ అని పేర్కొన్నారు. కాగా బట్లర్ IPLలో గుజరాత్ టీమ్‌లో ఆడనున్నారు.
News March 19, 2026
పుచ్చకాయలో పోషకాలు ఎన్నో!

పుచ్చకాయలోని 91-92% నీరు వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్, సిట్రులిన్ రక్తపోటును నియంత్రించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. తక్కువ క్యాలరీల వల్ల, బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక. విటమిన్ A, C వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఫైబర్ జీర్ణక్రియను సక్రమం చేస్తుంది. విటమిన్-C ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే వ్యాయామం తర్వాత కండరాల నొప్పులను తగ్గించడంలో పుచ్చకాయ జ్యూస్ సాయపడుతుంది.
News March 19, 2026
రైతును రాజును చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్

TG: రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఈ ఏడాది రైతు నామ సంవత్సరంగా ఉండబోతోందని చెప్పారు. ఉగాది వేడుకల్లో మాట్లాడుతూ ‘అన్నదాతలకు ₹2లక్షల వరకు రుణమాఫీ చేశాం. భూభారతితో భూమి సమస్యలను పరిష్కరిస్తున్నాం. రైతు భరోసాకు ₹18వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఈ నెల 22న మరో విడత డబ్బులు రిలీజ్ చేయనున్నాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.


