News September 18, 2024
శుభ ముహూర్తం

✒ తేది: సెప్టెంబర్ 18, బుధవారం
✒ పౌర్ణమి: ఉదయం 8.04 గంటలకు
✒ పాడ్యమి: తెల్లవారుజామున 4.19 గంటలకు
✒ పూర్వాభాద్ర: ఉదయం 11.00 గంటలకు
✒ వర్జ్యం: ఉదయం 7.25 నుంచి 8.49 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 11.37 నుంచి మధ్యాహ్నం 12.25 గంటల వరకు
Similar News
News December 1, 2025
పాలమూరు: ప్రలోభాలకు లొంగకుండా సర్పంచ్లను ఎన్నుకోండి- CM

స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, డబ్బు వంటి ప్రలోభాలకు లోనుకాకుండా మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మక్తల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడారు. గ్రామాభివృద్ధిని అడ్డుకునే వారిని దూరం పెట్టి, ప్రభుత్వానికి అండగా నిలిచి నిధులను తీసుకురాగల సర్పంచ్ అభ్యర్థులను ప్రజలు ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు.
News December 1, 2025
ఆఫీసు వర్క్ కంటే పేరెంటింగ్తోనే అధిక ఒత్తిడి

బయటకు వెళ్లి పనులు చేయడం, జాబ్ చేయడం కంటే పిల్లలతో ఇంట్లో ఉండటం ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తుందని చెబుతున్నాయి పలు అధ్యయనాలు. ఇంటి పనుల్లో బ్రేక్ లేకపోవడం, సోషల్ ఇంటరాక్షన్ తక్కువ, మెంటల్ లోడ్ ఎక్కువవడం దీనికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఒత్తిడి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందంటున్నారు. సపోర్ట్ సిస్టమ్స్ ఉంటే ఈ ఒత్తిడి వల్ల వచ్చే చాలా సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు.
News December 1, 2025
ఏపీలో 10 చోట్ల వాటర్ ఏరో డ్రోమ్స్

APలోని 10 ప్రాంతాల్లో వాటర్ ఏరో డ్రోమ్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. సీ ప్లేన్స్ ఆపరేషన్లకు వీలుగా వీటిని ఏర్పాటు చేయనుందని చెప్పింది. అరకు, గండికోట, కాకినాడ, కోనసీమ, లంబసింగి, నరసాపూర్, ప్రకాశం బ్యారేజీ, రుషికొండ, శ్రీశైలం, తిరుపతిలలో వీటిని ఏర్పాటు చేస్తారని పేర్కొంది. కాగా సీ ప్లేన్ల ద్వారా రాకపోకలు సాగించేలా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.


