News March 18, 2024
శుభ ముహూర్తం

తేదీ: మార్చి 18, సోమవారం,
ఫాల్గుణము శుద్ధ నవమి: రాత్రి 10:49 గంటలకు
ఆరుద్ర: సాయంత్రం 06:10 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:39-01:27 గంటల వరకు,
మధ్యాహ్నం 03:02-03:50 గంటల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 01:40-03:22 గంటల వరకు
Similar News
News March 10, 2026
14 ఏళ్ల బాలికలకు మాత్రమే HPV: ప్రభుత్వం

AP: రాష్ట్రవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలు 3.45 లక్షల మంది ఉన్నారని, 3 నెలల పాటు వీరికి మాత్రమే HPV వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. టీకా ఇచ్చాక 30 ని. పాటు అక్కడే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది. పలువురికి నొప్పి, వాపు, తేలికపాటి జ్వరం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని, ఇవి సాధారణంగా 2-3 రోజుల్లో తగ్గుతాయని పేర్కొంది. కాగా 3 నెలలపాటు ఈ టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది.
News March 10, 2026
స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేస్తున్న ఇరాన్?

విదేశాల్లోని స్లీపర్ సెల్స్‌ను ఇరాన్ యాక్టివేట్ చేస్తోందని US అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇరాన్ నుంచి వెళ్లినట్లుగా భావిస్తున్న ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌ను నిఘా వర్గాలు గుర్తించాయి. ఖమేనీ మరణం తర్వాత ఈ సిగ్నల్స్ పంపినట్లు కనుగొన్నాయి. కోవర్ట్ ఆపరేటివ్స్/స్లీపర్ సెల్స్‌కు సూచనలు అందినట్లుగా అంచనావేశాయి. ఇదే నిజమైతే వారి ద్వారా ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేశాయి.
News March 10, 2026
తమిళనాడులో NDAకు ఎంట్రీ లేదు: స్టాలిన్

బీజేపీ ఆధ్వర్యంలోని NDAకు తమిళనాడులో ఎంట్రీ లేదని సీఎం స్టాలిన్ అన్నారు. ‘TNకు ఏమీ ఇవ్వకూడదనుకునే వారికి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు? అయినా ఓట్లు అడిగేందుకు వాళ్లెలా వస్తారు? ఈ ఎన్నికలు తమిళనాడు-NDA మధ్య, DMK టీమ్‌కు-ఢిల్లీ టీమ్‌కు మధ్యే జరుగుతున్నాయి. AIADMKను మింగేయాలని బీజేపీ చూస్తోంది. ఆ పార్టీని చూస్తే జాలి కలుగుతోంది. బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారు’ అని విమర్శించారు.


