News October 16, 2024
శుభ ముహూర్తం

తేది: అక్టోబర్ 16, బుధవారం
చతుర్దశి: రాత్రి.8.40 గంటలకు
ఉత్తరాభాద్ర: రాత్రి 7.17 గంటలకు
వర్జ్యం: ఉదయం 6.36-8.00 గంటల వరకు, తెల్లవారుఝామున 5.48 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 11.29-12.16 గంటల వరకు
Similar News
News January 2, 2026
దాడికి సిద్ధం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

ఇరాన్‌లో పోలీసుల కాల్పుల్లో ఏడుగురు <<18737357>>నిరసనకారులు<<>> మరణించడంపై US అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై కాల్పులు జరపడం ఇరాన్‌కు అలవాటే. దానిని వెంటనే ఆపాలి. లేకుంటే అమెరికా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. మేము లాక్ చేసి లోడ్ చేసుకుని దాడికి సిద్ధంగా ఉన్నాం’ అని పోస్ట్ చేశారు. ‘US జోక్యం చేసుకుంటే పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయి’ అని ఇరాన్ కౌంటరిచ్చింది.
News January 2, 2026
కుడి ఎడమైతే.. పొరపాటు ఉందోయ్!

కేరళలో నిన్న BJP పేపర్ ‘జన్మభూమి’లో IUML పేపర్ ‘చంద్రిక’ కంటెంట్ వచ్చింది. ఉదయమే జన్మభూమి చదువుతూ, మధ్యలో BJPని తిట్టే కంటెంట్ చూసి కమల నేతలు ఆశ్చర్యపోయారు. ఇరు పేపర్ల కన్నూర్-కాసర్‌గోడ్ ఎడిషన్ ఒకే ప్రెస్‌లో ప్రింట్ అవుతుంది. అక్కడ పొరపాటున అవతలి పార్టీ కంటెంట్ ప్రింట్ అయిందని తర్వాత తెలిసింది. కాగా BJP-ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ బ్యాక్ డోర్ దోస్తీని ఈ ప్రెస్ నిరూపించిందని CPIM విమర్శించింది.
News January 2, 2026
జల జగడంపై కమిటీ.. కేంద్రం నిర్ణయం

తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున కమిటీలో సభ్యులు ఉండనున్నారు. అలాగే కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు, NWDA, CWC సీఈలు కూడా సభ్యులుగా వ్యవహరిస్తారు.


