News October 31, 2024
శుభ ముహూర్తం
✒ తేది: అక్టోబర్ 31, గురువారం
✒ చతుర్దశి: మధ్యాహ్నం 3.53 గంటలకు
✒ చిత్త: రాత్రి 12.44 గంటలకు
✒ వర్జ్యం: ఉదయం 6.43-8.31 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 9.55-10.41 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: మధ్యాహ్నం 2.32-3.18 గంటల వరకు
Similar News
News November 18, 2024
నిద్రపోకుండా వ్యాయామం చేస్తున్నారా?
రోజూ ఉదయమే నిద్రలేచి వ్యాయామం, వాకింగ్ చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే దీనికోసం ఉదయం 4/5 గంటలకే లేచి ఎక్కువసేపు వ్యాయామం చేయడం మంచిదా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. డా. సుధీర్ కుమార్ రిప్లై ఇచ్చారు. ‘అందరికీ 7-9 గంటలు నిద్ర అవసరం. నిత్యం తక్కువ నిద్రపోయి ఎక్కువసేపు వ్యాయామం చేయడం మంచిదికాదు. వ్యాయామం చేసేముందు వాంఛనీయ నిద్ర ఉండేలా చూసుకోండి’ అని ఆయన సూచించారు. మీరు రోజూ ఎంతసేపు నిద్రపోతారు?
News November 18, 2024
హెజ్బొల్లా కీలక నేత హతం
హెజ్బొల్లా మీడియా రిలేషన్స్ చీఫ్ మహ్మద్ అఫీఫ్ను ఇజ్రాయెల్ హతమార్చింది. బీరుట్లో జరిపిన ఐడీఎఫ్ వైమానిక దాడిలో అఫీఫ్ మృతి చెందారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాలోనూ దాడులు చేస్తోంది. ఇవాళ జరిపిన దాడుల్లో 12 మంది పౌరులు మరణించారు. కాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై దాడి జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
News November 17, 2024
రేపు ఢిల్లీకి కేటీఆర్!
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. వికారాబాద్(D) లగచర్ల గిరిజనులతో కలిసి జాతీయ ST కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లగచర్లలో ఫార్మా భూసేకరణపై చర్చించే క్రమంలో కలెక్టర్పై పలువురు దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.