News November 1, 2024
శుభ ముహూర్తం

✒ తేది: నవంబర్ 1, శుక్రవారం
✒ అమావాస్య: సాయంత్రం 6.16 గంటలకు
✒ స్వాతి: తెల్లవారుజామున 3.30 గంటలకు
✒ వర్జ్యం: ఉదయం 6.59-8.46 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 8.24-9.10 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.13-12.59 గంటల వరకు
Similar News
News February 5, 2026
పాపాలు, వ్యాధులను మాయం చేసే ఆలయం

MHలోని నాసిక్ జిల్లాలో 7 పర్వతాల నడుమ వెలసిన క్షేత్రం సప్తశృంగి ఆలయం. సతీదేవి కుడి చేయి పడిన ఈ ప్రదేశం 52 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారు 10 అడుగుల ఎత్తులో, 18 చేతులతో ‘మహిషాసుర మర్దిని’గా దర్శనమిస్తారు. రాముడు, హనుమంతుడు సందర్శించిన ఈ ప్రాంతంలోని పవిత్ర తీర్థాలలో స్నానం చేస్తే పాపాలు, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని నమ్మకం. ప్రకృతి సౌందర్యం మధ్య కొలువైన అమ్మవారి దర్శనం ధైర్యన్నిస్తుంది.
News February 5, 2026
FEB 12 వరకు టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు ‘తత్కాల్’ గడువు

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల(MARCH 2026)కు తత్కాల్ స్కీమ్ కింద ఫిబ్రవరి 6 నుంచి 12వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. రెగ్యులర్, ప్రయివేటు అభ్యర్థులు ఈ అవకాశం వినియోగించుకోవచ్చన్నారు. సంబంధిత స్కూళ్ల యాజమాన్యాలు తమకు కేటాయించిన ఐడీలతో ‘www.bse.ap.gov.in’ ద్వారా విద్యార్థుల ఫీజులు సమర్పించాలని సూచించారు.
News February 5, 2026
దేవుడిని అపవిత్రం చేయడమే వారి మిషన్: CBN

AP: ఆలయంలో దొంగతనం జరిగితే అది తప్పు అనే భావన లేదని చంద్రబాబు పరకామణి చోరీ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేశారు. ‘మీకు నమ్మకం లేదు కాబట్టే సమర్థిస్తున్నారు. దోచుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చారని చెబుతున్నారు. 219 దేవాలయాలపై దాడి చేశారు. భగవంతుడిని అపవిత్రం చేయడమే వారి మిషన్. కల్తీ నెయ్యిపై ఏకసభ్య కమిటీ వేశాం. మనం నిమిత్తమాత్రులమే. దేవుడు ఎలా శిక్షిస్తాడో మీరే చూస్తారు’ అని తెలిపారు.


