News November 3, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: నవంబర్ 3, ఆదివారం
✒ శు.విదియ: రాత్రి 10.25 గంటలకు
✒ అనురాధ పూర్తి
✒ వర్జ్యం: ఉదయం 10.19- మధ్యాహ్నం 12.03 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: సాయంత్ర 4.03-4.49 గంటల వరకు

Similar News

News January 15, 2026

తలసానిపై కేసు.. వివాదం ఏంటి?

image

TG: BRS సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై SR నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన సికింద్రాబాద్‌లో జరిగిన ఓ ప్రోగ్రాంలో ‘సికింద్రాబాద్‌ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం’ అని CM రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్ డివిజన్ల పునర్విభజన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత రవి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా FIR ఫైల్ చేశారు.

News January 15, 2026

‘ఈసారి బులెట్ మిస్ అవ్వదు’.. ట్రంప్‌కు హెచ్చరిక

image

ఇరాన్ ప్రభుత్వానికి చెందిన టీవీ ఛానెల్‌ (Islamic Republic State TV) ట్రంప్‌కు హెచ్చరికలు చేస్తూ సంచలన ప్రసారాలు చేసింది. 2024 ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం దృశ్యాలను టెలికాస్ట్ చేస్తూ, ‘ఈసారి బులెట్ మిస్ అవ్వదు’ అంటూ హెచ్చరించింది. తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రసారం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దీనిపై ఆ దేశ అధికారులు స్పందించలేదు.

News January 15, 2026

చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

image

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్​లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.