News November 17, 2024
శుభ ముహూర్తం

తేది: నవంబర్ 17, ఆదివారం
విదియ: రా.9.06 గంటలకు
రోహిణి: సా.5.22 గంటలకు
వర్జ్యం: ఉ.10.04-11.31 గంటల వరకు
దుర్ముహూర్తం: సా.4.01-4.46 గంటల వరకు
రాహుకాలం: సా.4.30-6.30 గంటల వరకు
Similar News
News December 1, 2025
కరీంనగర్: ‘గుర్తుల గుర్తుంచుకో రామక్క’

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచ్‌కు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు రంగుల బ్యాలెట్ పేపర్లు కేటాయిస్తారు. కాగా వీరి ఎన్నికలో ఇవే కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర, కప్, ఛైర్, కొబ్బరికాయ సైన్స్ బానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు తారుమారయ్యే ప్రమాదముంది.
News December 1, 2025
అభ్యర్థులతో ప్రధాన పార్టీలకు ‘పంచాయితీ’!

TG: పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, BRS, BJPలకు సొంత నేతల నుంచే ప్రమాదం పొంచి ఉంది. పలు గ్రామాల్లో ఒకే పార్టీ నేతలు నామినేషన్ వేయడమే దీనికి కారణం. ఓట్లు చీలే అవకాశం ఉండటంతో వారికి నచ్చజెప్పి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీ బలపరిచిన అభ్యర్థినే బరిలో ఉంచేలా పావులు కదుపుతున్నాయి. కాగా తొలి విడత నామినేషన్ల విత్ డ్రాకు ఈ నెల 3 ఆఖరు.
News December 1, 2025
భార్యను చంపి సెల్ఫీ.. వాట్సాప్‌లో స్టేటస్

భార్యను చంపి డెడ్ బాడీతో సెల్ఫీ తీసుకున్నాడో భర్త. కోయంబత్తూరు(TN)లో నివసించే బాలమురుగన్, శ్రీప్రియ(30)కు ముగ్గురు సంతానం. అయితే శ్రీప్రియ కొన్నాళ్లుగా హాస్టల్లో ఉంటూ జాబ్ చేస్తోంది. భార్య ఇంకొకరితో రిలేషన్లో ఉందని బాలమురుగన్ అనుమానం పెంచుకున్నాడు. హాస్టల్‌కు వెళ్లి కొడవలితో దాడి చేసి చంపాడు. బాడీతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ‘ద్రోహానికి ఫలితం మరణం’ అని రాసుకొచ్చాడు.


