News November 18, 2024

శుభ ముహూర్తం

image

తేది: నవంబర్ 18, సోమవారం
తదియ: సా.6.56 గంటలకు
మృగశిర: మ.3.48 గంటలకు
వర్జ్యం: రా.11.54-1.26 గంటల వరకు
దుర్ముహూర్తం: మ.12.15-1.00 గంటల వరకు
తిరిగి మ.2.30-3.15 గంటల వరకు
రాహుకాలం: మ.3.00-సా.4.30 గంటల వరకు

Similar News

News November 19, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,24,860కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 1,100 ఎగబాకి రూ.1,14,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 19, 2025

పండ్ల తోటల్లో పిందె/కాయలు ఎందుకు రాలిపోతాయి?

image

పండ్ల తోటల్లో పుష్పాలు సరిగా సంపర్కం చెందకపోతే పిందె సరిగా కట్టదు. ఒకవేళ కట్టినా కాయలు ఎదగక మధ్యలోనే రాలిపోతాయి. తోటల్లో సజ్రతని, బోరాన్, కాల్షియం, పొటాష్ పోషకాలు, హోర్మోన్ల లోపం వల్ల కూడా పిందెలు, కాయ ఎదిగే దశల్లో రాలిపోతాయి. రసం పీల్చే పురుగులు, పండు ఈగ, ఆకుమచ్చ, బూడిద తెగుళ్లు, అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, రాత్రివేళ అల్ప ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వర్షాల వల్ల పండ్ల తోటల్లో పిందెలు, కాయలు రాలుతాయి.

News November 19, 2025

ఆ భయంతోనే ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీకి!

image

లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎక్కడ తమ వివరాలు బయటపెడతారేమోనని మిగతా నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అనేక మంది ఛత్తీస్‌గఢ్ నుంచి APకి వచ్చి తలదాచుకుంటున్నారని సమాచారం. ఎలాంటి భయం లేకుండా లొంగిపోవడానికి రావాలని, తాము రక్షణ కల్పిస్తామని ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చెప్పారు. అటు హిడ్మాను పట్టుకుని కాల్చి చంపినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌లోనే చనిపోయాడన్నారు.