News April 13, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఏప్రిల్ 13, శనివారం
చైత్రము
శు.పంచమి: మధ్యాహ్నం: 12:04 గంటలకు
మృగశిర: అర్ధరాత్రి 12:49 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 5:53 నుంచి ఉదయం 6:43 గంటల వరకు
తిరిగి సాయంత్రం 6:43 నుంచి రాత్రి 7:33 వరకు
వర్జ్యం: సాయంత్రం 6:26 నుంచి రాత్రి 8:02 వరకు

Similar News

News March 16, 2026

రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ గెలుపు

image

బిహార్ CM నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రంలో 5 స్థానాలకు ఎన్నికలు జరగ్గా NDA కూటమి అన్నింటినీ కైవసం చేసుకుంది. నితీశ్ కుమార్‌తో పాటు BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎంపీలుగా ఎన్నికయ్యారు. దీంతో నితీశ్ త్వరలోనే CM పదవికి రాజీనామా చేయనున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ MP, MLA, MLCగా పనిచేశానని, రాజ్యసభ పదవితో మిగిలిన ఆ కోరిక నెరవేరబోతుందని చెప్పిన విషయం తెలిసిందే.

News March 16, 2026

కొత్త సబ్జెక్టులతో UG, PG కోర్సులు

image

TG: పాత డిగ్రీ కోర్సులకు కాలం చెల్లింది. అవి నేటి అవసరాలకు తగ్గట్టు ఉంటేనే ఉపాధి అవకాశాలు. ఈదిశగా TGCHE వాటిని ప్రక్షాళించింది. UG, PGలలో డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, ల్యాండ్, అగ్రికల్చర్, ఎయిర్ లైన్స్, స్పేస్, మారిటైమ్, ఫిన్‌టెక్, INT.బ్యాంకింగ్, ఫైనాన్స్, మల్టీమీడియా, యానిమేషన్, బయోమెడిక్స్, MED.మైక్రో బయాలజీ, ఇమ్యూనాలజీ వంటివి పెట్టింది. ఈ సమాచారాన్ని ‘https://tgche.ac.in’లో పొందుపరిచింది.

News March 16, 2026

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. SKLM, VZM, మన్యం, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ELR, కృష్ణా, NTR, GNT, KNL, NDYL, ATP, TPT జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
– ఇప్పటివరకు చదవని వార్తల కోసం పైన అన్‌రీడ్ బటన్ క్లిక్ చేసి UPDATEలో ఉండండి.