News November 23, 2024

శుభ ముహూర్తం

image

తేది: నవంబర్ 23, శనివారం
అష్టమి: రా.7.57 గంటలకు
మఖ: రా.7.27 గంటలకు
వర్జ్యం: ఉ.6.18-ఉ.8.03 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.6.16-ఉ.7.01 గంటల వరకు
రాహుకాలం: ఉ.9.00-ఉ.10.30 గంటల వరకు

Similar News

News November 23, 2024

పెర్త్ టెస్టుకు రికార్డ్ బ్రేకింగ్ అటెండెన్స్

image

పెర్త్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న BGT తొలి టెస్టుకు తొలి రోజు 31,302 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఒక్క రోజులో ఇంత మంది అక్కడ మ్యాచ్‌ను చూడటం ఇదే తొలిసారి. దీంతో పెర్త్‌లో సింగిల్ డేలో అత్యధిక మంది చూసిన మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించింది. నేడు, రేపు మ్యాచ్ మరింత ఆసక్తికరంగా జరిగే అవకాశమున్న నేపథ్యంలో ఈ టెస్టులోనే ఈ రికార్డు బ్రేక్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

News November 23, 2024

నేడే మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

image

మహారాష్ట్రలో 288, ఝార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. MHలో మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటముల్లో ఏది గెలవనుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ స్థానాలకు, రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలూ నేడే రానున్నాయి. వయనాడ్ లోక్ సభ స్థానంలో నిలిచిన ప్రియాంక గాంధీ భవితవ్యం ఈరోజే తేలనుంది. ఉ.8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది.

News November 23, 2024

ఈనెల 30న రైతు విజయోత్సవ సభ: భట్టి

image

TG: ఈనెల 30న మహబూబ్‌నగర్‌లో రైతు విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మార్గాల్లో భారీ కార్నివాల్, లేజర్ షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.