News April 15, 2024
శుభ ముహూర్తం

తేది: ఏప్రిల్ 15, సోమవారం చైత్రము శు.సప్తమి: మధ్యాహ్నం: 12:11 గంటలకు పునర్వసు: మరుసటి రోజు తెల్లవారుజామున 03:05 గంటలకు దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:32 నుంచి 01:21 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 03.00 గంటల నుంచి 03.50 గంటల వరకు, వర్జ్యం: మధ్యాహ్నం 02:20 నుంచి సాయంత్రం 04:02 గంటల వరకు
Similar News
News March 18, 2026
గుడ్‌న్యూస్.. 60% సీట్లపై నో ఎక్స్‌ట్రా ఛార్జ్

విమాన సీట్ల సెలక్షన్ ఛార్జీల పేరుతో ఎయిర్‌లైన్స్ కంపెనీలు చేస్తున్న అదనపు వసూళ్లకు కేంద్రం చెక్ పెట్టింది. కనీసం 60% సీట్లను ఎటువంటి ఎక్స్‌ట్రా ఛార్జ్ లేకుండా కేటాయించాలని DGCA ఆదేశించింది. ఒకే PNRపై ప్రయాణించే కుటుంబ సభ్యులను పక్కపక్క సీట్లలోనే కూర్చోబెట్టాలని స్పష్టం చేసింది. విమానాల రద్దు, ఆలస్యం వంటి సందర్భాల్లో ప్రయాణికుల హక్కులను లోకల్ లాంగ్వేజెస్‌లో డిస్‌ప్లే చేయాలని పేర్కొంది.
News March 18, 2026
ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా?

గ్యాస్ కొరత నేపథ్యంలో ఇటీవల ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం పెరిగింది. అయితే ఈ స్టవ్‌లను ఉపయోగించిన వెంటనే ఆఫ్ చేయొద్దని పలు కంపెనీలు సూచిస్తున్నాయి. వంట పూర్తయ్యాక కొంత సేపు స్టాండ్ బై మోడ్‌లో ఉంచాలంటున్నాయి. ఇలా చేస్తే స్టవ్‌లో ఉన్న కూలింగ్ ఫ్యాన్ లోపలి భాగాల వేడిని తగ్గిస్తుందని చెబుతున్నాయి. వెంటనే ఆఫ్ చేస్తే స్టవ్‌లోని సున్నితమైన భాగాలు ఎక్కువసేపు వేడిగా ఉండి పనితీరు తగ్గుతుందంటున్నాయి.
News March 18, 2026
మూసీ ప్రక్షాళనను BRS అడ్డుకుంటోంది: భట్టి

TG: మూసీ ప్రక్షాళనను BRS వ్యతిరేకిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో విమర్శించారు. పునరుజ్జీవనంపై ఆ పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు అదే ప్రాంతంలో అపార్ట్‌మెంట్లు నిర్మించి పునరావాసం కల్పిస్తామని సీఎం చెప్పారని గుర్తు చేశారు. కానీ వారి జీవితాలు బాగుపడకుండా మురికి కూపంలోనే ఉండాలని BRS కోరుకుంటోందని భట్టి మండిపడ్డారు.


