News April 19, 2024
శుభ ముహూర్తం

తేది: ఏప్రిల్ 19, శుక్రవారం చైత్రము శు.ఏకాదశి: రాత్రి 08:05 గంటలకు మఖ: మరుసటి రోజు ఉదయం 10:56 గంటలకు దుర్ముహూర్తం: ఉదయం 08:22 నుంచి 09:12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 12.31 నుంచి 01.21 గంటల వరకు, వర్జ్యం: రాత్రి 07:59 నుంచి 09:47 గంటల వరకు
Similar News
News November 12, 2025
HNK: మూడో రోజు.. మూడు జిల్లాల యువత సత్తా చాటారు!

హనుమకొండ జేఎన్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ మూడో రోజు మూడు జిల్లాల అభ్యర్థులతో ఉత్సాహంగా సాగింది. ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్ జిల్లాల నుంచి ఎంపికైన 623 మంది అభ్యర్థులు రన్నింగ్, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో పాల్గొన్నారు. ఆర్మీ అధికారులు ఎత్తు, బరువు, ఛాతీ ప్రమాణాలను పరీక్షించి, ఉత్తీర్ణులైన వారికి మెడికల్ పరీక్షలు నిర్వహించారు.
News November 12, 2025
జమ్మూకశ్మీర్లో 500 ప్రాంతాల్లో పోలీసుల దాడులు

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఏకంగా 500 లొకేషన్లలో రెయిడ్స్ చేపట్టారు. జమాతే ఇస్లామీ(JeI), ఇతర నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు, టెర్రరిస్టు సహాయకులకు చెందిన ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. JeI అనుబంధ టెర్రరిస్టులు తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు.
News November 12, 2025
ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతాం: కేంద్రం

ఢిల్లీ పేలుడు మృతులకు కేంద్ర క్యాబినెట్ సంతాపం తెలిపింది. ఇది ఉగ్రవాద చర్య అని అధికారికంగా ప్రకటించింది. ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ‘దర్యాప్తును అత్యవసరంగా నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఉగ్రవాదులు, వారి స్పాన్సర్లను గుర్తించి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించింది’ అని తెలిపారు. పరిస్థితిని అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.


