News April 25, 2024
శుభ ముహూర్తం
తేది: ఏప్రిల్ 24, బుధవారం
బ.పాడ్యమి: ఉదయం 6:46 గంటలకు
స్వాతి: అర్ధరాత్రి 12:41 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.11:40 నుంచి మ.12.30 వరకు
వర్జ్యం: తెల్లవారుజాము 4:38 నుంచి ఉ.6:22 వరకు
Similar News
News November 20, 2024
గంభీర్ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు: సైమన్ డౌల్
భారత కోచ్‌గా గంభీర్ ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అభిప్రాయపడ్డారు. గ్రెగ్ చాపెల్ కంటే తక్కువ కాలంలోనే ఉద్వాసనకు గురవుతారని అన్నారు. ‘గంభీర్‌కు అసహనం ఎక్కువ. BGTలో ఎలా ఆడాలన్నదానిపై ఆటగాళ్లను కూర్చోబెట్టి మాట్లాడటం కీలకం. ఈ సిరీస్‌లో ఫలితాలు బాగుంటే ఓకే. ఒకవేళ భారత్ 1-4 లేదా 0-5 తేడాతో ఓడిపోతే ఆయన కోచ్‌గా కొనసాగేది అనుమానమే’ అని స్పష్టం చేశారు.
News November 20, 2024
రూ.6600 కోట్ల బిట్‌కాయిన్ స్కామ్.. మలుపు మలుపుకో ట్విస్ట్ (1)
‘బిట్‌కాయిన్ స్కామ్’ చిన్నదేం కాదు! దీని విలువ ఏకంగా రూ.6600 కోట్లు. మహారాష్ట్ర, పంజాబ్‌లో 40 FIRs నమోదయ్యాయి. 2018లో పుణేలో కేసు నమోదవ్వగానే మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్ దుబాయ్‌కు పారిపోయారు. 2022 JANలో ఆయన మరణించారు. దీంతో కుటుంబం మొత్తంపై 2024లో ED ఛార్జిషీట్ వేసింది. 2017లో ఆయన కంపెనీ వేరియబుల్ టెక్ మల్టీలెవల్ మార్కెటింగ్ విధానంలో రూ.6600 కోట్ల BTCలను కలెక్ట్ చేసింది. ఆ తర్వాతేం జరిగిందంటే..
News November 20, 2024
రూ.6600 కోట్ల బిట్‌కాయిన్ స్కామ్.. మలుపు మలుపుకో ట్విస్ట్ (2)
సాధారణంగా బిట్‌కాయిన్లను వ్యాలెట్లో స్టోర్ చేస్తారు. దర్యాప్తులో తేలిందేమిటంటే రూ.6600 కోట్ల BTCలు అసలు వ్యాలెట్ నుంచి మాయమయ్యాయి. ఇద్దరు పోలీసాఫీసర్లు వీటిని మరో వ్యాలెట్లోకి బదిలీ చేశారని తెలిసింది. మొత్తంగా ఈ స్కామ్‌లో 2 లేయర్లు ఉన్నాయి. మొదటి దాంట్లో అమిత్ వంటివాళ్లు, రెండో దాంట్లో గౌరవ్ మెహతా, సుప్రియా సూలె, నానా పటోలే వంటి నేతలు ఉన్నారని ఆరోపణ. డబ్బులున్న వ్యాలెట్ వీరికి తెలుసని సమాచారం.