News May 5, 2024
శుభ ముహూర్తం

తేది: మే 05, ఆదివారం
బ.ద్వాదశి: సాయంత్రం 05:42 గంటలకు
ఉత్తరాభాద్ర: రాత్రి 07:57 గంటలకు
దుర్ముహూర్తం: సాయంత్రం.04:42 నుంచి 05:33 వరకు
వర్జ్యం: ఉదయం 06:51 నుంచి 08:18 వరకు
Similar News
News March 13, 2026
వారసత్వ స్థలాలకు సెల్ఫ్ డిక్లరేషన్ చాలు!

AP: వారసత్వంగా లభించే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై గ్రామాల్లోని ఇలాంటి స్థలాల రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్ అవసరం లేదు. యజమానుల సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. తమకు పూర్వీకుల నుంచే ఆస్తి వచ్చిందని, నిషేధిత జాబితా(22A)లో లేదని, తామే పూర్తి హక్కుదారు అని అందులో స్పష్టంగా పేర్కొనాలి. తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు.
News March 13, 2026
కల్తీ పాల ఘటనలు.. FSSAI కీలక ఆదేశాలు

దేశంలో <<19323083>>కల్తీ పాల<<>> ఘటనలు వెలుగు చూస్తుండటంతో FSSAI కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై డెయిరీ కోఆపరేటివ్ సొసైటీల సభ్యులు మినహా పాల ఉత్పత్తిదారులు, విక్రయదారులు కచ్చితంగా రిజిస్ట్రేషన్/లైసెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని స్పష్టం చేసింది. రాష్ట్రాల అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని సూచించింది. సర్టిఫికెట్ లేకుండా వ్యాపారాలు చేస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాలని తేల్చిచెప్పింది.
News March 13, 2026
అమెరికాకు చిల్లు.. రష్యాకు కాసుల పంట

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా జేబుకు చిల్లు పడితే రష్యా మాత్రం దీనిని క్యాష్ చేసుకుంటోంది. చమురుకు డిమాండ్ పెరగడంతో ఆదాయంలో ఆ దేశానికి రోజుకు అదనంగా 150 మిలియన్ డాలర్లు (₹1,300 కోట్లు) వస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖరుకు ఈ సంక్షోభం వల్ల రష్యాకు అదనంగా $5 బిలియన్లు (₹46వేల కోట్లు) రెవెన్యూ వస్తుందని అంచనా. మరోవైపు US ఇరాన్‌పై భారీగా ఖర్చు చేస్తోంది. వారంలోనే 6 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది.


