News May 20, 2024

శుభ ముహూర్తం

image

తేది: మే 20, సోమవారం
శు.ద్వాదశి: మధ్యాహ్నం 03:59 గంటలకు చిత్తా: తెల్లవారుజామున 05:46 గంటలకు దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:29 నుంచి 01:20 వరకు తిరిగి మధ్యాహ్నం 03:03 నుంచి 03:54 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 12:06 నుంచి 01:52 వరకు

Similar News

News December 23, 2024

ఆ లోపు అమరావతి టెండర్ల ప్రక్రియ పూర్తి: మంత్రి నారాయణ

image

AP: అమరావతిలో జోన్ 7, జోన్ 10 లేఅవుట్‌ల కోసం రూ.2,723 కోట్ల నిర్మాణ పనులకు సీఆర్డీఏ అంగీకారం తెలిపిందని మంత్రి నారాయణ అన్నారు. వచ్చే నెల 15 కల్లా రాజధాని నిర్మాణాల టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తామని చెప్పారు. మొత్తం 7 లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం 2.61 లక్షల ఇళ్లు కూడా పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. జూన్ 12లోగా లక్షా 18వేల టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు.

News December 23, 2024

పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

UPSC నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన పూజా ఖేడ్క‌ర్ ముందస్తు బెయిల్ పిటిష‌న్‌ను ఢిల్లీ HC తోసిపుచ్చింది. తప్పుడు ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌తో సివిల్స్‌లో ప్ర‌యోజ‌నాలు పొందారన్న ఆరోపణలపై ఆమెను కేంద్రం స‌ర్వీసు నుంచి తొలగించింది. ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌ను మోసం చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమెకు గ‌తంలో క‌ల్పించిన మ‌ధ్య‌ంత‌ర ర‌క్ష‌ణ‌ను కూడా కోర్టు తొల‌గించింది. త్వరలో ప్ర‌భుత్వం ఆమెను విచారించే అవ‌కాశం ఉంది.

News December 23, 2024

అల్లు అర్జున్ మామ వచ్చినట్లు మాకు తెలియదు: మహేశ్ కుమార్

image

TG: అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్‌కు వచ్చినట్లు తమకు తెలియదని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. ఆయనొచ్చిప్పుడు తాము ప్రెస్‌మీట్లో ఉన్నామన్నారు. తర్వాత చంద్రశేఖర్ ఫోన్ చేసి మాట్లాడారని, మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పినట్లు వెల్లడించారు. AAతో తమకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదని మహేశ్ మరోసారి స్పష్టం చేశారు. గాంధీభవన్‌కు వచ్చిన చంద్రశేఖర్‌ను మున్షీ మాట్లాడకుండానే పంపించేశారు.