News March 22, 2024
శుభ ముహూర్తం

తేదీ: మార్చి 22, శుక్రవారం,
ఫాల్గుణము
శుద్ధ త్రయోదశి: ఉదయం 07:17 గంటలకు
మఖ: తెల్లవారుజామున 04:28 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 08:37-09:25 గంటల వరకు,
మధ్యాహ్నం 12:38-01:26 గంటల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 02:57-04:45 గంటల వరకు
Similar News
News February 9, 2026
క్యారెట్‌తో ఎన్ని ప్రయోజనాలో?

క్యారెట్‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, బీటా-కెరోటిన్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చి మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్-A కంటిచూపును, విటమిన్-C రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చి, విటమిన్-K ఎముకలను ధృడంగా చేస్తుంది. వీటిని పచ్చిగా, ఉడికించి లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
News February 9, 2026
మార్చి 31న సెలవు రద్దు: RBI

మార్చి 31(మహావీర్ జయంతి)న బ్యాంకుల సెలవు రద్దు చేస్తూ RBI ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం హాలీడే ఉన్నా ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆ రోజున పనివేళలు కొనసాగించాలని తెలిపింది. 2025-26 FYలోపే ప్రభుత్వ రసీదులు, చెల్లింపులకు సంబంధించి ట్రాన్సాక్షన్లు జరిగినట్లు పరిగణనలోకి తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. సాధారణ కార్యకలపాలపై కస్టమర్లు బ్రాంచ్‌ను ధ్రువీకరించుకోవడం ఉత్తమం.
News February 9, 2026
డ్రైవర్ నిర్లక్ష్యం.. 30 మంది మృతి

నైజీరియాలోని కానోలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 30 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. గాయపడినవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా ఈ దేశంలో రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ట్రాఫిక్ చట్టాలు అమలు చేయడంలో వైఫల్యం వల్ల తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.


