News May 21, 2024

శుభ ముహూర్తం

image

తేది: మే 21, మంగళవారం
శు.త్రయోదశి: సాయంత్రం 05:39 గంటలకు
చిత్తా: తెల్లవారుజామున 05:46 గంటలకు దుర్ముహూర్తం: ఉదయం 08:13 నుంచి 09:04 వరకు తిరిగి రాత్రి 10:56 నుంచి 11:41 వరకు
వర్జ్యం: ఉదయం 11:50 నుంచి 01:34 వరకు

Similar News

News December 24, 2024

ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయం: టీటీడీ

image

AP: దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మిస్తామని TTD EO శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ‘ప్రపంచంలోని పలు దేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం. సీఎం ఆదేశాల మేరకు ఇందుకు ఓ కమిటీ వేస్తున్నాం. నడక దారిలో వచ్చే భక్తుల కోసం ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తాం. TTD సేవలపై భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

News December 24, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

బంగాళాఖాతంలో అల్పపీడనం రానున్న 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది.

News December 24, 2024

బడ్జెట్‌పై ఆర్థికవేత్తలతో మోదీ సమాలోచనలు

image

కేంద్ర బ‌డ్జెట్‌లో పొందుప‌ర‌చాల్సిన అంశాలు, కేటాయింపుల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకొనేందుకు ఆర్థిక‌వేత్త‌లు, భిన్న రంగాల నిపుణుల‌తో ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేకంగా సమావేశ‌మ‌య్యారు. Feb 1న నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. Niti Aayog Vice-Chairman సుమన్ బేరీ, CEO సుబ్రహ్మణ్యం, Chief Economic Advisor అనంత నాగేశ్వరన్, ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా తదితరులు పాల్గొన్నారు.