News June 6, 2024
శుభ ముహూర్తం

తేది: జూన్ 6, గురువారం
బ.అమావాస్య: రాత్రి 07.55 గంటలకు
రోహిణి: రాత్రి 10:16 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.09:56 నుంచి 10:48 వరకు తిరిగి మధ్యాహ్నం గం.03.07 నుంచి 03.59 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం గం.12.36 నుంచి 02.08 వరకు
Similar News
News November 27, 2025
కుళ్లిన పండ్లను తీసుకుని.. : అంధుల క్రికెట్ కెప్టెన్ కన్నీళ్లు

మహిళల అంధుల క్రికెట్ <<18367663>>ప్రపంచకప్ను<<>> ఇటీవల ఇండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కెప్టెన్ దీపిక ఎమోషనల్ అయ్యారు. ‘జనం విసిరేసే కుళ్లిన పండ్లలో చెడు భాగాన్ని తీసేసి మిగతాది నేను, నా తోబుట్టువులు తినేవాళ్లం. మా ఇంట్లోనే కాదు ప్రతి ప్లేయర్ ఇంట్లో రోజుకు ఒకపూట భోజనం దొరకడం కూడా కష్టం. ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
News November 27, 2025
PDPL: ‘అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి’

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభివృద్ధి పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని అన్నారు. ఆయన రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం మండలాల్లోని పంచాయతీరాజ్, ఆర్&బీ శాఖ పనులను సమీక్షించారు. వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రి నిర్మాణం, సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News November 27, 2025
ఆ బంగ్లాను రబ్రీదేవి ఖాళీ చేయరు: RJD

RJD చీఫ్ లాలూ భార్య రబ్రీదేవి ఉంటున్న నివాసాన్ని ఆమె ఖాళీ చేయరని, ఏం చేసుకుంటారో చేసుకోండని ఆ పార్టీ బిహార్ చీఫ్ మంగానీ లాల్ మండల్ తెలిపారు. జీవితకాల నివాసం కింద ఆ బంగ్లాను కేటాయించినట్లు చెప్పారు. పట్నాలోని అన్నే మార్గ్లో CM నివాసం ఎదుట రబ్రీదేవి, లాలూ 2 దశాబ్దాలుగా ఉంటున్నారు. కాగా దాన్ని ఖాళీ చేసి హార్డింజ్ రోడ్ 39 బంగ్లాకు మారాలంటూ ఇటీవల నితీశ్ ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా RJD స్పందించింది.


