News June 30, 2024
శుభ ముహూర్తం

తేది: జూన్ 30, ఆదివారం
జ్యేష్ఠము
బ.నవమి: మధ్యాహ్నం 12:19 గంటలకు
రేవతి: ఉదయం 07:34 గంటలకు దుర్ముహూర్తం: మధ్యాహ్నం 04:56- 05:48 గంటల వరకు
వర్జ్యం లేదు.
Similar News
News April 8, 2026
ముంచుకొస్తున్న కరవు.. 2027 వరకు గడ్డుకాలమే!

పసిఫిక్ సముద్రం వేడెక్కుతోంది. రాబోయేది మామూలు ఎల్ నినో కాదు. ఏకంగా ‘సూపర్ ఎల్ నినో’ అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల 2027 వరకు ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతాయి. ఇండియాలో వర్షాలు కురవక సాగు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దక్షిణ అమెరికాలో భారీ వరదలు, ఆసియాలో కరవు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వాతావరణం అల్లకల్లోలంగా మారనుంది. దీనికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
News April 8, 2026
సీజ్‌ఫైర్.. హార్ముజ్‌ను దాటాలంటే ఫీజు!

హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే నౌకలు/ఆయిల్ ట్యాంకర్ల నుంచి ఇరాన్, ఒమన్ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. సీజ్‌ఫైర్ ప్లాన్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. దేశాన్ని మళ్లీ నిర్మించుకునేందుకు ఈ డబ్బును ఉపయోగిస్తామని ఇరాన్ చెప్పినట్లు రీజినల్ అధికారి ఒకరు తెలిపారు. ఒమన్, ఇరాన్ దేశాల మధ్యలో హార్ముజ్ ఉంటుంది. అంతర్జాతీయ జలమార్గం కావడంతో యుద్ధానికి ముందు ఎన్నడూ టోల్ ఫీజులను ఎవరూ వసూలు చేయలేదు.
News April 8, 2026
4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశమంతటా ‘సర్’!

తుది దశ ఓటర్ల జాబితా సవరణ(సర్)ను 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. AP, తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక సహా 17 రాష్ట్రాలు, 5 UTల్లో ఈ నెల 29 నుంచి చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటిదాకా 10 రాష్ట్రాలు, 3 UTల్లో ‘సర్’ పూర్తయింది. అస్సాంలో స్పెషల్ రివిజన్ నిర్వహించారు. మొత్తం 60 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించారు. తుది దశలో 39 కోట్ల మంది వివరాలు రివ్యూ చేయనున్నారు.


