News March 28, 2024

కాంగ్రెస్‌కు మరో కీలక నేత గుడ్‌బై!

image

దేశంలోనే సంపన్న మహిళ, హరియాణా మాజీ మంత్రి సావిత్రీ జిందాల్ కాంగ్రెస్‌కు వీడ్కోలు పలికారు. కుటుంబసభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. కాగా ఆమె కుమారుడు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ పార్టీ ఆయనకు కురుక్షేత్ర సీటును ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో సావిత్రీ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News April 6, 2026

డెలివరీ ఏజెంట్స్ లిఫ్ట్ వాడొద్దా.. మీరేమంటారు?

image

ప్రస్తుతం అన్నీ డోర్ డెలివరీలే. కానీ వాటిని చేరవేసే వారికి మాత్రం కనీస గౌరవం దక్కట్లేదు. కొన్ని అపార్ట్‌మెంట్లలో డెలివరీ బాయ్స్ లిఫ్ట్ వాడొద్దని ఆంక్షలు పెట్టి, వాడితే జరిమానాలు వేస్తున్నారు. 2AMకు కూడా మెట్లు ఎక్కి రావాలనే కస్టమర్ల ప్రవర్తన తమను అవమానపరచడమే అని ఓ డెలివరీ ఏజెంట్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. వారు కూడా మనుషులేనని, వారికి కనీస మర్యాద ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మీ కామెంట్?

News April 6, 2026

ఏపీకి ఒకే ఒక్క రాజధాని అమరావతి: సీఎం

image

AP: అమరావతికి YCP తప్ప దేశంలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని సీఎం చంద్రబాబు అనంతపురం సభలో అన్నారు. ఏపీకి ఒకే ఒక్క రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. నిన్నటి వరకు రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేశారని, ఇప్పుడు అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేశామన్నారు. రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. అమరావతి అని పలకడం ఇష్టం లేక మావిగన్ అంటూ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.

News April 6, 2026

వచ్చే నెలలో మద్యం ధరల పెంపు?

image

TG: రాష్ట్రంలో మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 12-15% ధరలు పెంచాలని బ్రూవరీస్ చేసిన ప్రతిపాదనల ఫైల్‌ను రిటైర్డ్‌ జడ్జితో కూడిన జుడీషియల్‌ కమిటీకి పంపింది. వారంలో నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగాయని, ధరలు పెంచాలని డిస్టిలరీల యాజమాన్యాలు ఇటీవల ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో కమిటీ రిపోర్టు ఆధారంగా వచ్చే నెలలో మద్యం ధరలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.